- పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్ ఆప్షన్లో లభించే అవకాశం
- ఇండియన్ మార్కెట్లోకి ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ కారుగా వస్తున్న నయా మోడల్
బుకింగ్స్ ప్రారంభం
మొత్తానికి రూ.11,000 బుకింగ్ అమౌంట్ తో మారుతి స్విఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఈ మోడల్ ఈ నెల 9వ తేదీన లాంచ్ కానుంది. ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ కారుగా వస్తున్న ఈ పాపులర్ హ్యచ్ బ్యాక్ ఇండియాలో పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్ ఆప్షన్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
డిజైన్ హైలైట్స్ మరియు ఫీచర్ లిస్టు
గత సంవత్సరం జపాన్ లో ప్రదర్శించబడగా, కొత్త స్విఫ్ట్ స్పోర్ట్స్ లుక్ తో, అవుట్ గోయింగ్ మోడల్ లాగా కొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, వీల్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, మరియు మరోసారి డోర్ హ్యండిల్స్ సి-పిల్లర్ నుంచి డోర్స్ వద్దకు అమర్చబడి సరికొత్త డిజైన్ ని పొందింది.
ఇంటీరియర్ పరంగా, లోపల చూస్తే ఇది స్టాండర్డ్ మారుతి ధరతో ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కోసం కొత్త ఫ్లోటింగ్ డిస్ ప్లే, భారీ ఫుల్-కలర్ ఎంఐడి, మరియు కొత్త క్లైమేట్ కంట్రోల్ ఇంటర్ ఫేస్ వంటి వాటిని కలిగి ఉంది. తాజాగా మేము తెలుసుకున్న్డది ఏంటి అంటే, ఈ స్విఫ్ట్ కారు చాలా వరకు ఫీచర్లను ఫ్రాంక్స్ నుంచి తీసుకుంది. అందులో రియర్ ఏసీ వెంట్స్, యుఎస్‍బి-సి ఛార్జింగ్ పోర్ట్, మరియు అర్కామిస్ సౌండ్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి.
స్విఫ్ట్ వేరియంట్ ఆప్షన్స్
మారుతి కంపెనీ ఈ కారును పెట్రోల్ మరియు సిఎన్‍జి ఆప్షన్లతో అందించనుండగా LXi, VXi, and Zxi వంటి వేరియంట్లనే ఇందులో కూడా అవే పేర్లను కొనసాగించనుంది. స్టాండర్డ్ వేరియంట్ తో పోలిస్తే “ప్లస్” ఆప్షన్ ద్వారా బహుశా ఇవి మరిన్ని ఫీచర్లను పొందనుంది.
కొత్త స్విఫ్ట్ పవర్ ట్రెయిన్
అంతర్జాతీయంగా, స్విఫ్ట్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కొత్త 3-సిలిండర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని అందించగా, ఇండియాలో మాత్రం K12C 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ని కొనసాగించవచ్చు. ఈ ఇంజిన్ స్టాండర్డ్ టైప్ లో 88bhp/113Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని 5-స్పీడ్ ఎంటి లేదా 5-స్పీడ్ ఎఎంటి ద్వారా జత చేసి పొందవచ్చు. సిఎన్‍జి మోడ్ లో, ఇది 78bhp/98Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, ఇందులో కేవలం 5-స్పీడ్ మాన్యువల్ మాత్రమే అందించబడింది.
ధర మరియు కాంపీటీషన్
కొత్త స్విఫ్ట్ రేంజ్ ధర రూ.6.5 లక్షల నుండి ప్రారంభమై రూ.10 లక్షల వరకు ఉండవచ్చని మేము భావిస్తున్నాము. ఇది రెనాల్ట్ ట్రైబర్, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి సెలెరియో, టాటా పంచ్ మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లతో పోటీపడుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ అతి పెద్ద పోటీని ఎదుర్కొంటుండగా, గత 17 ఏళ్లుగా వివిధ జనరేషన్ల ద్వారా ఇతర కార్లతో పోటీని కొనసాగిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్