- 2024-మే నెలలో లాంచ్ అయిన ఫోర్త్-జెన్ స్విఫ్ట్
- ఇప్పటికే 35,000+ పైగా కొత్త ఇటరేషన్ కార్లను విక్రయించిన మారుతి
మారుతి సుజుకి ఈ సంవత్సరం మే నెలలో ఇండియాలో ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ కారును రూ. 6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. దీని టాప్-స్పెక్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ. 9.44 లక్షలుగా ఉంది. ఇప్పుడు, స్విఫ్ట్ కారు లాంచ్ అయిన రెండు నెలల తర్వాత, కార్‌మేకర్ ఈ రీఫ్రెష్డ్ హ్యాచ్‌బ్యాక్‌పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.
2024 జూలై నెలలో కొత్త స్విఫ్ట్ రూ. 17,000 వరకు బెనిఫిట్స్ తో అందుబాటులో ఉంది. ఇందులో రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 2,000 కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి. మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, ముఖ్యంగా ఈ డిస్కౌంట్స్ లొకేషన్, వేరియంట్, కలర్ మరియు లభ్యత వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ డిస్కౌంట్స్ మారుతూ ఉంటాయి.
లాంచ్ అయిన రెండు నెలలకే అంటే, లైఫ్ సైకిల్ ప్రారంభమైన తర్వాత ఇంత త్వరగా కొత్త స్విఫ్ట్‌పై డిస్కౌంట్స్ ప్రకటించడం వెనుక రెండు పెద్ద కారణాలు ఉండవచ్చు. మొదటి కారణం ఏంటి అంటే, ధర అంశం ఆధారంగా, స్విఫ్ట్‌ను బాలెనోకు పోటీగా తీసుకురావడమే అని తెలుస్తుంది. ఈ రెండు కార్ల ఎంట్రీ-లెవల్ వేరియంట్ల వ్యత్యాసం కేవలం రూ. 17,000 మాత్రమే ఉండగా, టాప్-స్పెక్ వేరియంట్ల మధ్య వ్యత్యాసం రూ. 44,500 ఉంది. రెండవ కారణం ఏంటి అంటే, ఇందులో సిఎన్‍జి వేరియంట్ లేకపోవడం అని చెప్పవచ్చు. మారుతి కంపెనీ ప్రస్తుతం స్విఫ్ట్ లో సిఎన్‍జి తీసుకురావడానికి ముమ్మరంగా శ్రమిస్తుంది. అదే విధంగా ఇది మరికొన్ని నెలల్లో లాంచ్ కావచ్చని చెప్పవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్