- యూరో ఎన్ క్యాప్ ద్వారా టెస్టింగ్ చేయబడిన ఫోర్త్-జనరేషన్ మోడల్
- మే నెలలో ఇండియాలో లాంచ్ అయిన న్యూ-జెన్ స్విఫ్ట్ కారు
యూరో ఎన్ క్యాప్ ఒక ఫ్రెష్ సెట్ క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ ని రిలీజ్ చేయగా, అందులో కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్, 2024 డాసియా డస్టర్, కొత్త స్కోడా కొడియాక్ మరియు మరెన్నో కార్లు ఉన్నాయి. ఈ ఆర్ట్టికల్ లో, మనం లేటెస్టుగా యూరో ఎన్ క్యాప్ ద్వారా నిర్వహించిన క్రాష్ టెస్టులో ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ మోడల్ రిజల్ట్ ని తెలుసుకుందాం.
యూరో ఎన్ క్యాప్ ఆర్గనైజేషన్ ప్రకారం, క్రాష్ టెస్టులో 2024స్విఫ్ట్ మోడల్ కి 3-స్టార్ రేటింగ్ లభించింది. క్రాష్ టెస్టులో స్విఫ్ట్ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో 67 శాతం, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో 65 శాతం, సేఫ్టీ అసిస్ట్ లో 62 శాతం, రోడ్డుపై పెడెస్ట్రియన్ మరియు నాన్-మోటార్ సైక్లిస్ట్ విభాగంలో 76 శాతం స్కోర్ చేసింది.
ఇక్కడ టెస్టింగ్ చేయబడ్డ స్విఫ్ట్ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్స్, మరియు లోడ్ లిమిటర్స్, మరియు సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఈ కారు రెండవ వరుసలో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్ పాయింట్లు మరియు ఎడాస్ (ఏడీఏఎస్) వంటి అదనపు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే, కారు ప్యాసింజర్ కంపార్ట్ మెంట్ ఫ్రంటల్ ఆఫ్ సెట్ టెస్టులో (స్టేబుల్) స్థిరంగా ఉంది.
ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే, జపాన్ లో తయారై యూరప్ లో విక్రయించబడుతున్న స్విఫ్ట్ కారు మరియు ఇండియాలో విక్రయించబడుతున్న స్విఫ్ట్ కారుకు ఏ మాత్రం కనెక్షన్ లేదు. ప్రస్తుతం ఇండియాలో విక్రయించబడుతున్న స్విఫ్ట్ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, ఈఎస్ పీ, హెచ్ఎస్ఎ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం, స్పీడ్ అలర్ట్ సిస్టం, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్ పాయింట్స్, మరియు సుజుకి కనెక్ట్ టెక్నాలజీతో మరిన్ని అదనపు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మరికొన్ని నెలల్లో నిర్వహించబడనున్న బిఎన్ క్యాప్ టెస్టులో కొత్త స్విఫ్ట్ కారు ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుందో వేచిచూడాలి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్