- ఫోర్త్ జెన్ స్విఫ్ట్ ఆధారంగా రానున్న న్యూ-జెన్ మోడల్
- 2024 ప్రథమార్థంలో లాంచ్ అయ్యే అవకాశం
న్యూ-జెన్ మారుతి డిజైర్ మోడల్ మొదటిసారిగా ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న పూర్తి కామోఫ్లేజ్ తో కప్పబడి ఉన్న సింగిల్ యూనిట్ టెస్ట్ మ్యూల్ యొక్క స్పై షాట్స్ చూస్తే ఇది ఫోర్త్ జెన్ స్విఫ్ట్ ఆధారంగా వస్తుందనే విషయం వెల్లడవుతుంది.
ముందుగా ఫీచర్స్ గురించి చెప్పాలంటే, స్పై షాట్స్ చూస్తే 2024 డిజైర్ 360-డిగ్రీ కెమెరాతో వస్తున్నట్లు అర్థం అవుతుంది. అంతే కాకుండా, ఇది కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయల్-టోన్ థీమ్‌తో లేటెస్ట్ డ్యాష్‌బోర్డ్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను పొందనుంది.
స్పై షాట్స్ లో చూస్తే, డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కొత్త మారుతి డిజైర్ భారీ అప్ డేట్స్ పొందనుంది. టెయిల్ గేట్, అల్లాయ్ వీల్స్, మరియు టెయిల్ లైట్స్ మరియు మరిన్ని కొత్త డిజైన్ అంశాలను 2024 స్విఫ్ట్ ద్వారా తీసుకువచ్చే అవకాశం ఉంది.
కొత్త డిజైర్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదు. హుడ్ కింద, ప్రస్తుత మోడల్ యొక్క 1.2-లీటర్, 4 సిలిండర్, ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 89bhp పవర్ మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ స్థానాన్ని గ్లోబల్-స్పెక్ న్యూ-జెన్ స్విఫ్ట్ కొత్త Z12E ఇంజిన్ భర్తీ చేసే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్