- సెగ్మెంట్-ఫస్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో రానున్న మారుతి డిజైర్
- కొత్త 1.2-లీటర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతున్న మోడల్
మారుతి ఈ సంవత్సరం ప్రారంభంలో న్యూ-జెన్ స్విఫ్ట్ ను లాంచ్ అయిన తర్వాత, డిజైర్ ను కూడా అత్యంత ముఖ్యమైన అప్‌డేట్‌తో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయబోతోందని స్పష్టమైంది. అయితే కొన్ని నెలలు ఎదురుచూస్తుండగా, వివిధ స్పై షాట్స్ మరియు లీక్ అయిన చిత్రాల తర్వాత, కొత్త డిజైర్ నవంబర్ 4వ తేదీన ఇండియాలో లాంచ్ అవుతుందని ఎట్టకేలకు నిర్ధారించబడింది.
డిజైన్ పరంగా చూస్తే, కొత్త డిజైర్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లను కలిగి ఉంటుంది, వివిధ హారిజాంటల్ స్లాట్‌లతో కూడిన కొత్త గ్రిల్, కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు ఫాగ్ లైట్స్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ట్రయాంగులర్ గ్రాఫిక్స్‌తో కూడిన ఎల్ఈడీ టైల్‌లైట్స్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నాను పొందుతుందని అంచనా.
మా రిపోర్ట్స్ ప్రకారం, సబ్-ఫోర్-మీటర్ సెడాన్ ఇంటీరియర్ వివరాలలో, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్-టోన్ థీమ్, లార్జ్ ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ యూనిట్, మరియు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఉన్నాయి.
బానెట్ కింద, 2024 డిజైర్ కొత్త-జెన్ స్విఫ్ట్ లోని 1.2-లీటర్, 3 -సిలిండర్, Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉండవచ్చని భావిస్తున్నాం. ఈ ఇంజిన్ 80bhp మరియు 112Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్లతో జత చేయబడి, ట్రాన్స్‌మిషన్ ద్వారా (ముందు) ఫ్రంట్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది. అలాగే, ఇందులో సిఎన్‌జి వెర్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. అయితే ఆటోమేకర్ ఈ సిఎన్‌జి వెర్షన్ ను లాంచ్ అయిన వెంటనే అందిస్తుందా ? లేదా కొంతకాలానికి అందిస్తుందా ? అనేది చూడాలి.
అనువాదించిన వారు: రాజపుష్ప