- మరికొన్ని వారాల్లో లాంచ్ అయ్యే అవకాశం
- సెగ్మెంట్-ఫస్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ని పొందనున్న కారు ఇదే
మరికొన్ని వారాల్లో మారుతి సుజుకి డిజైర్ కారు లాంచ్ కానుండగా, దాని కంటే ముందుగా ఈ కారుకు సంబంధించిన కొన్ని వివరాలు లీకయ్యాయి. న్యూ-జనరేషన్ సబ్-ఫోర్ మీటర్ సెడాన్ ఎక్స్‌టీరియర్ డిజైన్ కి చెందిన రెండు ఫోటోలు ఇంటర్నెట్లో లీకయ్యాయి. ఇందులో ఏయే వివరాలు లీకయ్యాయో వాటి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా మనం చూద్దాం.
ఇక్కడ ఫోటోలలో చూసిన విధంగా, నెక్స్ట్-జనరేషన్ డిజైర్ కారు సరికొత్త డిజైన్ ని పొందుతుండగా, అందులో వివిధ రకాల హారిజాంటల్ స్లాట్స్ తో భారీ గ్రిల్, ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్, మరియు ఫ్రెష్ అల్లాయ్ వీల్స్ సెట్ వంటివి ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే, టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా మరియు హోండా అమేజ్ వంటి కార్లతో పోటీపడుతున్న ఈ అప్ డేటెడ్ మోడల్ 360-డిగ్రీ కెమెరా, కొత్త ట్రై-యారో ఎల్ఈడీ టెయిల్ లైట్స్(మూడు-బాణాల ఆకారంలో ఎల్ఈడీ టెయిల్ లైట్స్), బూట్ లిడ్ పై ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, మరియు సెగ్మెంట్-ఫస్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ని పొందింది. ఇంటీరియర్ కూడా బీజ్ అప్హోల్స్టరీతో అద్బుతంగా కనిపిస్తుండగా, మరింత డార్క్ కలర్లో డ్యాష్ బోర్డు థీమ్ ని కలిగి ఉంది.
బానెట్ కింద , 2024 మారుతి డిజైర్ కారు స్విఫ్ట్ లో అందించబడిన 80bhp మరియు 112Nm టార్కును ఉత్పత్తి చేసే 1.2-లీటర్, 3-సిలిండర్, Z-సిరీస్ ఇంజిన్ తో వస్తుందని భావిస్తున్నాం. ఈ కారు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లు ఉన్నాయి. అలాగే, డిజైర్ కారు సిఎన్‍జి వెర్షన్లో కూడా అందించేబడే అవకాశం ఉండగా, దీనికి సంబంధించిన లాంచ్ టైంలైన్ వివరాలను మారుతి ఈ కారు లాంచ్ సమయంలో లేదా తరువాత ప్రకటించే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్