- మరికొన్ని రోజుల్లో లాంచ్ అయ్యే అవకాశం
- బయట, లోపలి భాగాల్లో అదనపు ఫీచర్లను పొందనున్న రెండు కొత్త వేరియంట్స్
గత నెల చివర్లో, ఎక్స్‌యువి400 ఈవీ రేంజ్ లో వస్తున్న రెండు కొత్త వేరియంట్‌లపై మహీంద్రా తన పనిని కొనసాగిస్తున్నట్లు వాటి వివరాలను ఇంటర్నల్ ప్రెజెంటేషన్ ద్వారా లీక్ చేసింది. ఈ వేరియంట్‌లలో, టాప్-స్పెక్ EL ప్రో వేరియంట్ ఇప్పుడు డీలర్‌షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
ఇక్కడ ఉన్న చిత్రాలలో చూసినట్లుగా, 2024 మహీంద్రా ఎక్స్‌యువి400 ఎలక్ట్రిక్ ఎస్‌యువి షార్క్-ఫిన్ యాంటెన్నా, ఫ్రంట్ ఫాగ్ లైట్స్ మరియు వెనుక భాగంలో ఉన్న ఈవీ బ్యాడ్జింగ్ రూపంలో చిన్న చిన్న ఎక్స్‌టీరియర్ అప్‌డేట్‌లను పొందింది. అదే విధంగా ఈ మోడల్ 34.5kWh మరియు 39.4kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంటుంది.
ఇంటీరియర్ పరంగా లోపలి భాగంలో, న్యూ మహీంద్రా ఎక్స్‌యువి400 అలెక్సా కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీ, కొత్త స్టీరింగ్ వీల్ మరియు కొత్త 10.25-ఇంచ్ పూర్తి డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో కూడిన 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లను పొందనుంది.
అంతేకాకుండా, ఈ కారు ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ మరియు రీవర్క్డ్ డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉండనుంది . అలాగే ఇందులో వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్‌లు మరియు రెండవ వరుసలో ఛార్జింగ్ పోర్ట్స్ ఉండనున్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప