- రూ. 12.99 లక్షలతో ధరలు ప్రారంభం
- అందుబాటులో ఉన్న ఆర్‍డబ్ల్యూడి మరియు ఎడబ్ల్యూడి కాన్ఫిగరేషన్స్
మహీంద్రా అందరూఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైవ్ –డోర్ థార్ రాక్స్‌ను మొత్తానికి ఇండియాలో లాంచ్ చేసింది. థార్ ఈ కొత్త ఇటరేషన్ లో MX1,MX3, MX5, AX3L, AX5L మరియు AX7L అనే ఆరు వేరియంట్‌లలో రూ.12.99 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ కథనంలో, కొత్త థార్ రాక్స్‌తో అందించబడుతున్న అన్ని ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లను మేము లిస్ట్ చేసాము. వాటి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
కస్టమర్లు మహీంద్రా థార్ రాక్స్‌ను స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ, బాటిల్‌షిప్ గ్రే మరియు బర్న్ట్ సియెన్నా అనే 7 ఎక్స్‌టీరియర్ కలర్స్ లో పొందవచ్చు. ముఖ్యమైన అంశం ఏమిటంటే, అన్ని వెర్షన్లు ప్యాకేజీలో భాగంగా బ్లాక్ క్వార్టర్ ప్యానెల్‌ను పొందాయి.
మెకానికల్‍గా చెప్పాలంటే, కొత్త థార్ రాక్స్ - 2.0-లీటర్ టిజిడిఐ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ సిఆర్ డిఐ డీజిల్ ఇంజిన్ - అనే రెండు ఇంజిన్ ఆప్షన్ లతో వచ్చింది. అలాగే, పెట్రోల్ ఇంజిన్ ఆర్‍డబ్ల్యూడి వెర్షన్‌లకు మాత్రమే పరిమితం కాగా, డీజిల్ ఇంజిన్ థార్ రాక్స్ ఆర్‍డబ్ల్యూడి మరియు 4X4 ఇటరేషన్స్ రెండింటిలో అందించబడుతోంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, ఈ రెండు ఇంజిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడ్డాయి.
ఇప్పుడు, ఆటోమేకర్ థార్ రాక్స్ లోని టాప్-స్పెక్ 4X4వెర్షన్ల ధరను మినహాయించి మిగిలిన అన్ని వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. అలాగే, 3వ తేదీ అక్టోబర్ నెల నుండి ఈ మోడల్‌ను కస్టమర్‌లు బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, థార్ రాక్స్ టెస్ట్ డ్రైవ్ లు అధికారిక డీలర్స్ వద్ద సెప్టెంబర్ 14వ తేదీ నుండిప్రారంభం కానున్నాయి.