- ఇండియాలో రూ.10,89,900(ఎక్స్-షోరూం) నుండి ప్రారంభంకానున్న ధరలు
- 47శాతం బుకింగ్స్ ఏడీఏఎస్ వేరియంట్స్ సొంతం
జూలై 2023లో లాంచ్ అయ్యాక, కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కేవలం 2 నెలల్లోనే 50,000 రికార్డు బుకింగ్స్ మైలురాయిని అందుకుంది. దీంతో, కియా కాంపిటీటివ్ మిడ్-ఎస్ యు వి సెగ్మెంట్ అటో మొబైల్ సంస్థలలో వేగంగా ఈ ఫీట్ ను సాధించిన మొదటి అటో మొబైల్ తయారీ సంస్థగా నిలిచింది. ముఖ్యంగా, 47శాతం బుకింగ్స్ ఏడీఏఎస్ ఫీచర్స్ ఉన్న వేరియంట్స్ ద్వారానే వచ్చాయి.
మరో వార్తలో, కియా ఇండియా పండుగ సీజన్ ను సెల్టోస్ లైనప్ తో వస్తున్న రెండు కొత్త ఏడీఏఎస్ వేరియంట్స్ తో ఘనంగా ప్రారంభించనుంది. జిటిఎక్స్+(ఎస్), ఎక్స్-లైన్ అనే వేరియంట్స్ హెచ్‍టిఎక్స్+(ఎస్), ఎక్స్-లైన్ మధ్య సరిగ్గా సరిపోతాయి. ఏడీఏఎస్ సేఫ్టీ సూట్ తో వస్తున్న ఈ రెండు వేరియంట్స్ ఎక్స్ షోరూం ధరలు రూ.19.60 లక్షలు మరియు రూ.19.60 లక్షలుగా ఉన్నాయి.
సెల్టోస్ సక్సెస్ గురించి కియా ఇండియా చీఫ్ సేల్స్ బిజినెస్ ఆఫీసర్ యంగ్ సిక్ సాన్ మాట్లాడుతూ “ కొత్త తరం కస్టమర్లకు సెల్టోస్ చాలా నమ్మకాన్ని, సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ను అందించిందని, అలాగే డిజైన్ మరియు టెక్నాలజీ పరంగా కారు స్థాయిని మరింత పెంచాయని, ఇదే సెల్టోస్ సక్సెస్ కు కారణమన్నారు. పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రతిస్పందిస్తూ, మా ప్రొడక్షన్ నుంచి మినిమం వెయిటింగ్ పీరియడ్ ను తగ్గించామని, దీని ద్వారా కస్టమర్స్ ఫేవరేట్ ఎస్‍యువి కోసం ఎక్కువ సమయం వేచి చూసే అవకాశం ఉండదు” అని పేర్కొన్నారు.