- ఇండియాలో అక్టోబర్ 3న ప్రకటించబడనున్న EV9 ధరలు
- సింగిల్ ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో అందుబాటులోకి రానున్న EV9 మోడల్
వచ్చే నెల లాంచ్ కి సిద్ధంగా ఉన్న కొత్త కియా EV9 స్పెసిఫికేషన్లు మరియు బ్యాటరీ వివరాలను ఆటోమేకర్ వెల్లడించింది . అలాగే, అక్టోబర్ 3వ తేదీన బ్రాండ్ నుండి ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోడల్ గా కొత్త-జెన్ కార్నివాల్‌తో పాటు ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్నట్లు కంపెనీ పేర్కొంది.
ముందుగా దీని కొలతల గురించి చెప్పాలంటే, 2024 EV9 పొడవు 5,015ఎంఎం, వెడల్పు 1,980ఎంఎం మరియు ఎత్తు 1,780ఎంఎం ఉండనుంది. అలాగే, వీల్‌బేస్ దాదాపు 3,100ఎంఎంగా ఉండనుంది. ఇది 379bhp మరియు 700Nm ఉత్పత్తి చేసే డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌లతో జత చేయబడిన 99.8kWh బ్యాటరీ ప్యాక్ ని పొందగా, ఇది ఎడబ్ల్యూడి సిస్టమ్ ద్వారా నాలుగు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది. ఇంకా, ఈ కారు కేవలం 5.3 సెకన్లలో 100కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకుంటుంది.
కొత్త కియా EV9 ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ 561కిలోమీటర్ల క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఇందులోని డిసి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ తో కేవలం 24 నిమిషాల్లో బ్యాటరీని 10-80 శాతం వరకు ఛార్జ్ చేసేందుకు అనుమతిస్తుంది. అంతేకాకుండా, కస్టమర్‌లు ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును, స్నో వైట్ పెర్ల్, ఓషన్ బ్లూ, పెబుల్ గ్రే, పాంథెరా మెటల్ మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 5 కలర్ నుండి ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్