- రూ. 1 లక్ష టోకెన్ అమౌంట్ తో రిజర్వేషన్
- 2024 అక్టోబర్, 3న ధరల ప్రకటన
కియా ఇండియా కార్నివాల్ మరియు EV9 అనే రెండు కొత్త మోడళ్లను వచ్చే(అక్టోబర్)నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో రెండోది( EV9) ఫ్లాగ్‌షిప్ ఆల్-ఎలక్ట్రిక్ మూడు-వరుస ఎస్‌యూవీ కాగా, ఇంతకుముందు ఇండియాలో అమ్మకానికి ఉన్న ఎంపివికి జనరేషనల్ అప్‌డేట్ మోడల్ గా ఉంది. ఇప్పుడు, లాంచ్ కి ముందుగా, దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక డీలర్స్ కార్నివాల్ ఎంపివి ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించారు.
కార్నివాల్ ని బుక్ చేసుకోవాలనుకుంటున్న కస్టమర్లు వారి వారి పేర్లతో రూ. 1 లక్ష టోకెన్ అమౌంట్ చెల్లించి, బుక్ చేసుకోవచ్చు. అలాగే, ఈ కొత్త కారును కొరియన్ ఆటోమేకర్ ఒకే ఒక్క టాప్-స్పెక్ వెర్షన్‌లో వివిధ కలర్ ఆప్షన్స్ తో అందిస్తుంది. లాంచ్ కి సిద్ధంగా ఉన్న కొత్త కార్నివాల్ వైట్ కలర్ ఫినిషింగ్ తో ఇటీవలే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వద్ద కనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ కారు కంప్లీట్ బిల్ట్ యూనిట్ (సిబియు)గా దిగుమతి చేయబడి ఇక్కడ విక్రయించబడుతుంది. ఇది ఎంపివి ధరను జతచేసి తీసుకువచ్చే అవకాశం ఉంది. అప్‌డేటెడ్ కార్నివాల్ ధర సుమారు రూ. 45 లక్షల నుంచి రూ. 50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చు.
కొత్త కియా కార్నివాల్ అదే 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ తో ఉంటుంది. ఈ మోటార్ 191bhp మరియు 441Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ప్రస్తుతం చూస్తే, ధరల రేంజ్ ని బట్టి కార్నివాల్‌కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఏ మోడల్ కూడా లేదు. అయినప్పటికీ, టయోటా ఇన్నోవా హైక్రాస్ టాప్-ఎండ్ వెర్షన్ కియా కార్నివాల్‌కు పోటీగా పరిగణించవచ్చు. అదేవిధంగా, దీని ఫీచర్లు, డైమెన్షన్ మరియు బాడీ స్టైల్ ని బట్టి, ఈ కియా ఎంపివి రూ. 1 కోటి కంటే ఎక్కువ ధరతో ఉన్న టయోటా వెల్‌ఫైర్‌కి గట్టిపోటీని ఇస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప