- EV9 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీతో పాటుగా వస్తున్న కొత్త కార్నివాల్
- 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చే అవకాశం
అక్టోబర్ 3వ తేదీన కొత్త కియా కార్నివాల్ కారు ఇండియాలో లాంచ్ కాబోతుండగా, దాని కంటే ముందుగా మొదటిసారి కొత్త కార్నివాల్ టీజర్ ని కియా రిలీజ్ చేసింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటి అంటే, ఇండియన్ మార్కెట్లో ఈ కారుతో పాటుగా కొత్త EV9 ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ కారు కూడా ఒకేరోజు లాంచ్ కానుంది. కియా కార్లను ఇష్టపడే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
టీజర్లలో చూసినట్లుగా 2024 కియా కార్నివాల్ రెండు సన్ రూఫ్ లను పొందనుంది. ఇందులో ఒకటి ముందు వరుసలో కూర్చున్న వారికి, మరొకటి రెండవ-వరుసలో కూర్చున్న వారికి సౌలభ్యంగా కియా వీటిని తీసుకువచ్చింది. ఇంటీరియర్లోని క్యాబిన్ కూడా కొత్త డ్యూయల్-స్క్రీన్ సెటప్ తో రాగా, అందులో ఒకటి టచ్ స్క్రీన్ యూనిట్ గా మరియు ఇంకొకటి డ్రైవర్ డిస్ ప్లే కోసం కేటాయించబడింది.
కొత్త కార్నివాల్ ఎక్స్‌టీరియర్ హైలైట్లలో కొత్త గ్రిల్ తో ఫ్రెష్ ఫేసియా, నిలువుగా అమర్చినట్లు ఉండే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఇన్వర్టెడ్ ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కాంట్రాస్ట్ కలర్డ్ స్కిడ్ ప్లేట్స్, టెయిల్ గేట్ పై ఎల్ఈడీ లైట్ బార్, కొత్త అల్లాయ్ వీల్స్, ఫ్రెష్ రూఫ్ రెయిల్స్, మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా వంటివి ఉన్నాయి.
ఇంటీరియర్ పరంగా, కార్నివాల్ కారు లోపల ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, రెండవ వరుసలో కూర్చున్న వారి కోసం 14.6-ఇంచ్ స్క్రీన్స్, ఏసీని కంట్రోల్ చేయడానికి టచ్ యూనిట్ ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్స్, డిజిటల్ ఐఆర్‌విఎం మరియు హెడ్స్ అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఇండియా-స్పెక్ కారులో ఏ విధమైన సీటింగ్ అందించబడుతుందో చూడాలి మరి! ప్రపంచవ్యాప్తంగా ఈ కారు ఏడు, తొమ్మిది, పదకొండు సీట్ల కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది.
బానెట్ కింద, నెక్స్ట్-జనరేషన్ కియా కార్నివాల్ 197bhp మరియు 440Nm టార్కును ఉత్పత్తి చేసే 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తుండగా, ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జతచేయబడి వస్తుంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం, ఈ మోడల్ మొదటగా కంప్లీట్ బిల్ట్ యూనిట్ (సిబియు) వెర్షన్ గా ఇండియాలో అడుగుపెడుతుండగా, తర్వాత సికెడి సెటప్ ని ఫాలో అవుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్