- ఈ నెల ప్రారంభంలో ఇండియాలో లాంచ్
- ఒకేఒక్క వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చిన మోడల్
కియా ఇండియా ఈ నెల ప్రారంభంలో, ఇండియన్ మార్కెట్లో దాని సెకండ్ - జనరేషన్ కార్నివాల్‌ను లాంచ్ చేసింది. దీనిని రూ. 63.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. EV9 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఆఫర్‌తో పాటు లాంచ్ చేయనప్పటికీ, ఇప్పుడు దాని ప్రీమియం ఎంపివివి డెలివరీలను చేయడం ప్రారంభించింది.
ముఖ్యంగా చెప్పాలంటే, 2024 కియా కార్నివాల్ మొదటి యూనిట్ క్రికెటర్ సురేష్ రైనాకు డెలివరీ చేయబడింది. అలాగే, పూర్తిగా లోడ్ చేయబడిన లిమోసిన్ ప్లస్ వేరియంట్‌లో డ్యూయల్ సన్‌రూఫ్, లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్), మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా మరియు రెండవ వరుస కోసం పవర్డ్ డోర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే, న్యూ -జెన్ కియా కార్నివాల్‌లో అన్ని-ఎల్ఈడీ లైటింగ్, కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, 18-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కాంట్రాస్టింగ్ స్కిడ్ ప్లేట్స్ మరియు రియర్ ఎల్ఈడీ లైట్ బార్ ఉన్నాయి.
హుడ్ కింద, కార్నివాల్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. పవర్ అవుట్‌పుట్ 190bhp మరియు 441Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ మైలేజ్ 14.85కెఎంపిఎల్. మేము కార్నివాల్‌ని నడిపాము మరియు మా సమీక్ష వెబ్‌సైట్‌లో మీరు ఈ రివ్యూను చూడవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప