- యానివర్సరీ ఎడిషన్ వెర్షన్ ని కూడా పండుగ సీజన్‌లో లాంచ్ చేయనున్న కియా
- ఇండియాలో 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన ఫోర్త్-జనరేషన్ కార్నివాల్
కియా ఇండియా 3వ తేదీ అక్టోబర్, 2024న లాంచ్ కానున్న దాని రెండు కార్ల లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. లాంచ్ కానున్న రెండు కార్లు మరేవో కావు, అవే న్యూ కార్నివాల్ మరియు EV9 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ అనే కార్లు. అలాగే, కియా సోనెట్, సెల్టోస్ మరియు కారెన్స్ వంటి సెలెక్ట్ చేసిన మోడల్స్ లో న్యూ యానివర్సరీ ఎడిషన్స్ ని కూడా ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో ఇండియాలో లాంచ్ చేస్తుందని మేము ఆశిస్తున్నాము.
న్యూ-జెన్ కార్నివాల్ మునుపటి-జెన్ మోడల్ కాన్సెప్ట్ ఆధారంగా రాగా, మరియు 2023లో ఢిల్లీలో ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన అదే ఇటరేషన్ ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, కియా సిగ్నేచర్ డిజైన్ అంశాలతో పూర్తిగా కొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్ తో మాత్రమే కాకుండా, ఈఎంపివి డ్యూయల్ 12.3-ఇంచ్ స్క్రీన్స్, ఏడీఏఎస్(ఎడాస్) సూట్, దీని రెండవ వరుస సీట్స్ మధ్యలో కూర్చున్న ప్రయాణీకుల కోసం 14.6-ఇంచ్ స్క్రీన్స్, డిజిటల్ ఐఆర్‍విఎం, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు 8 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
కియా EV9 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ, ఇండియన్ మార్కెట్ లో ఈ బ్రాండ్ నుండి వస్తున్న రెండవ ఈవీ అవుతుంది. ఇది సిబియు రూట్ లో ఇండియాకు రానుంది. ఈ మూడు-వరుసల మోడల్‌ను 2డబ్ల్యూడి మరియు 4డబ్ల్యూడి వెర్షన్‌లలో అందింస్తుండగా, దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే, 500 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ని అందిస్తుంది. ఈ కారు ముఖ్యమైన ఫీచర్లలో లెవల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్, రెండవ వరుసలో పవర్డ్ సీట్స్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్‌గేట్, డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లేస్ మరియు మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప