- అక్టోబర్ 3వ తేదీ లాంచ్ కానున్న కియా కార్నివాల్
- రూ. 2 లక్షల టోకెన్అమౌంట్ తో బుకింగ్స్ ప్రారంభం
కియా ఇండియా దాని అప్ కమింగ్ (రాబోయే) కొత్త కార్నివాల్ ఎంపివి ద్వారా భారీ మైలురాయిని సాధించింది. సెప్టెంబర్ 16వ తేదీనకొత్త ప్రీమియం ఎంపివి కారు బుకింగ్‌లు ప్రారంభం కాగా, కేవలం 24 గంటల్లోనే ఈ మోడల్ 1,822 బుకింగ్‌లను నమోదు చేసి, కొత్త రికార్డును నెలకొల్పింది.
2024 అక్టోబర్ 3వ తేదీన EV9తో పాటుగా ఫోర్త్-జనరేషన్ కార్నివాల్ కూడా లాంచ్ కానుంది. ఆసక్తి కలిగిన కస్టమర్‌లు రూ. 2 లక్షలు టోకెన్ అమౌంట్ చెల్లించి ప్రీమియం ఎంపివిని వారి వారి పేరుతో బుక్ చేసుకోవచ్చు. కొత్త కార్నివాల్ సిబియు రూట్ ద్వారా ఇండియాకి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది, అలాగే ధరల విషయానికొస్తే, ఇండియాలో దీని (ఎక్స్-షోరూమ్) ధర సుమారు రూ.45 లక్షల నుండి రూ.50 లక్షల మధ్య ఉంటుందని మేము భావిస్తున్నాం.
ఫీచర్ల పరంగా చెప్పాలంటే, కొత్త కార్నివాల్ ఎంపివి వెంటిలేటెడ్ రియర్ సీట్స్, పవర్డ్ స్లైడింగ్ రియర్ డోర్స్, డ్యూయల్ సన్‌రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం ట్విన్ 12.3-ఇంచ్ స్క్రీన్స్, బోస్-సోర్స్డ్ 12-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ మరియు లెవెల్- 2 ఏడీఏఎస్(ఎడాస్)సూట్ వంటి ఫీచర్లతో వస్తుంది.
ఈ రికార్డుపై కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ జున్సు చో మాట్లాడుతూ, “కొత్త కార్నివాల్ ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. కార్నివాల్ లిమౌసిన్ విభాగాన్ని పునర్నిర్వచించగలదని మేము ఆశిస్తున్నాము. దాని సరికొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లు మరియు సెగ్మెంట్-ఫస్ట్ టెక్నాలజీ ద్వారా, కార్నివాల్ ఇండస్ట్రీ బెంచ్‌మార్క్‌లను పెంచుతూనే ఉంది'. అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: రాజపుష్ప