- సెకండ్ జనరేషన్ గా రానున్న కొత్త ఎస్‍యూవీ
- నెక్స్ట్-జెన్ మెరిడియన్ తో పాటుగా వచ్చే అవకాశం
జీప్ బ్రాండ్ నుంచి ఎన్నో మోడల్స్ రాగా, ఇండియాలో ఎవరైనా ఈజీగా గుర్తించే కారు ఏదైనా ఉంది అంటే అది కంపాస్ మోడల్ అని చెప్పవచ్చు. ఇది ఇప్పుడు 2027లోపు కొత్త జనరేషన్ లోకి అడుగుపెట్టబోతుంది. ఆటోమేకర్ దాని భవిష్యత్ ప్రణాళికలలో భాగంగా ఈ నయా మోడల్ గురించి అధికారికంగా ప్రకటించింది. ఈ అప్ డేటెడ్ కంపాస్ దాని ప్రస్తుత మోడల్ నుంచి ఎన్నో అంశాలను తీసుకోవడంతో పాటుగా కొత్త ఫీచర్లు, డిజైన్, మరియు మరింత సామర్థ్యంతో రానుంది. ఇది ఆల్-న్యూ రాంగ్లర్ తో పాటుగా, అదే విధంగా ఆల్-న్యూ గ్రాండ్ చెరోకీతో జాయిన్ అవ్వనుంది.
ప్రపంచవ్యాప్తంగా దాని భారీ ప్రణాళికలలో భాగంగా అమెరికన్ ఆటోమేకర్ దాని పెద్ద కార్లతో పాటుగా ఆల్-న్యూ ఎస్‍యూవీలను పరిచయం చేస్తుండగా, దాని లైనప్ లో ముందుగా కంపాస్ ని తీసుకురానుంది. మార్కెట్ మరియు చూసే విధానాన్ని బట్టి ఈ ఎస్‍యూవీ డిజైన్ వేరుగా ఉండవచ్చు. ఇది ఆల్-న్యూ మూడు వరుసల (త్రీ-రో) మెరిడియన్ లాగా ఉండే అవకాశం ఉంది.
ఈ కొత్త మోడల్స్ మరింత బెస్ట్ లుక్ తో రానుండగా, ప్రస్తుతం ఇండియాలో జీప్ బ్రాండ్ రైట్ హ్యాండ్ డ్రైవ్ (ఆర్‍హెచ్ డి) కార్ల హబ్ గా ఉంది. పూణేలోని రంజన్ గావ్ ఫ్యాక్టరీలో తయారైన కార్లన్నీ డొమెస్టిక్ పరంగా వినియోగించబడుతుంగా మరియు విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్