- వచ్చే ఏడాది ఇండియాలో అరంగేట్రం
- మెకానికల్‍గా ఎటువంటి మార్పుల్లేకుండా వచ్చే అవకాశం
హ్యుందాయ్ అంతర్జాతీయ మార్కెట్లో తన కొత్త టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. ఇప్పుడు తాజా అప్‌డేట్‌తో, రెండు-వరుసల ప్రీమియం ఎస్‌యువి సరికొత్త అప్‌డేటెడ్ ఇంటీరియర్ మరియుఎక్స్‌టీరియర్ డిజైన్‌ను పొందుతుంది. ఈ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ వచ్చే ఏడాది ఎప్పుడైనా ఇండియన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.
లోపలి భాగంలో, టక్సన్ డిజైన్ లో మార్పు మరియు రీడిజైన్ పారామెట్రిక్ గ్రిల్ సరికొత్తగా కనిపిస్తుంది, అలాగేన్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్ ద్వారా చిన్న చిన్న అడ్జస్ట్ మెంట్లన పొందింది. అంతే కాకుండా, ఈ మోడల్ మునుపటి అప్‌డేట్ కంటే మరింత మెరుగైన అప్‌డేట్ ను పొందింది.
అయినప్పటికీ, ఈ టక్సన్ లోని ఇంటీరియర్స్ చాలా ముఖ్యమైన మార్పులను పొందుతుంది. ఇది న్యూ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ లేఅవుట్, ట్వీక్ చేయబడిన ఎయిర్‌కాన్ వెంట్స్ మరియు కంట్రోల్ ప్యానెల్, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ట్విన్ 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు మరియు సెంటర్ కన్సోల్ కొత్త గేర్ లివర్ వంటి సరికొత్త ఫీచర్స్ ను కలిగి ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే, టక్సన్ లో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటిని కొనసాగించనుంది.
మెకానికల్‍గా, ఈ న్యూ టక్సన్ పవర్డ్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో కొనసాగుతుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, దీని ఇంజిన్స్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడ్డాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప