- లెవెల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ తో రానున్న మోడల్
- సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్ కానున్న అల్కాజార్
హ్యుందాయ్ ఇండియా మూడు వరుసల ఎస్‌యూవీ అల్కాజార్ ను 2024 సెప్టెంబర్ 9వ తేదీన ఫేస్‌లిఫ్టెడ్ అవతార్‌లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే సమయంలో దీని ధరలు కూడా ప్రకటించబడతాయి. క్రెటా-ఆధారంగా రానున్న ఈ మోడల్ కొత్త ఫీచర్లను తీసుకురావడంతో పాటు రెండవ-వరుసలో కూర్చునే వారి సౌకర్యాలపై ఎక్కువ దృష్టి సారించింది. అదనంగా, హ్యుందాయ్ ఈ ఫేస్‌లిఫ్ట్‌తో అల్కాజార్ సేఫ్టీ ఫీచర్లను కూడా మెరుగుపరిచింది.
ఇందులో అతిపెద్ద అప్‌డేట్ ఏమిటంటే, హ్యుందాయ్ అల్కాజార్ లెవెల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ వంటి హైటెక్ ఫీచర్‌లతో ఇండియన్ మార్కెట్లో రానుంది. అలాగే, ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ మరియు అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ , హిల్ స్టార్ట్ అసిస్ట్, ఈఎస్‍పీ, మొత్తం 4 డిస్క్ బ్రేక్స్, టిపిఎంఎస్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్ మరియు ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం వంటి మరిన్నిసేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా అందించబడతాయి.
కస్టమర్ కి సౌకర్యంగా ఉండేందుకు కొత్త అల్కాజార్ రెండు డిజిటల్ స్క్రీన్స్ వస్తుండగా, సైజ్ పరంగా రెండూ 10.25 ఇంచ్ వస్తున్నాయి, ఇంకా ఇది టచ్-సెన్సిటివ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, డ్యూయల్-జోన్ ఏసీ, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, ముందు మరియు రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, రెండవ- వరుసలో వైర్‌లెస్ ఛార్జర్, మాగ్నెటిక్ ప్యాడ్ వంటి మరిన్ని ఫీచర్స్ ను పొందుతుంది.
కొత్త హ్యుందాయ్అల్కాజార్ఇంతకు ముందు వెర్షన్ లాగే 6-స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ను కలిగి ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప