- ఇండియాలో 2025లో లాంచ్ అవుతుందని అంచనా
- లాంచ్ సమయంలో ఈ మోడల్ బిగ్‌స్టర్ అనే పేరుతో వచ్చే అవకాశం
రెనాల్ట్ ఇండియా ఇటీవల వెల్లడించిన డాసియా డస్టర్‌ను వచ్చే సంవత్సరంలో ఇండియాకి తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఇండియాలో అరంగేట్రానికి ముందే, న్యూ-జెన్ డస్టర్ దాని మూడు వరుసల రూపంలో అంతర్జాతీయ పబ్లిక్ రోడ్ల పై టెస్ట్ చేస్తూ గుర్తించబడగా, ఇది లాంచ్ సమయంలో బిగ్‌స్టర్ అనే పేరుతో పిలుబడుతుంది.
స్పై షాట్‌లలో చూసినట్లుగా, మూడు-వరుసల రెనాల్ట్ డస్టర్ దాని చంకీ మరియు మస్క్యులర్ స్టైలింగ్‌ను ప్రదర్శిస్తుంది. అలాగే, ఎస్‌యువిలోని సిల్హౌట్ ఫంక్షనల్ రూఫ్-రెయిల్స్, ఎక్స్‌టెండెడ్ రూఫ్ స్పాయిలర్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు స్క్వేర్డ్-ఆఫ్ వీల్ ఆర్చ్‌లతో కూడా కనిపిస్తుంది.
ఇంకా కనిపిస్తున్న ఇతర అంశాలలో పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్, ఇన్‌వర్టెడ్ సి-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ మరియు మల్టీ-స్పోక్ బ్లాక్డ్-అవుట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.
దీనిని దగ్గరగా చూసినట్లయితే, ఎస్‌యూవీ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ లో కంట్రోల్స్ తో కూడిన 4-స్పోక్ స్టీరింగ్ వీల్, టిల్టెడ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు వంటివి కనిపిస్తాయి. అలాగే, ఇందులో ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా మరియు ఏడీఏఎస్(ఎడాస్) సూట్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా అందించబడతాయని ఆశిస్తున్నాము.
మెకానికల్‍గా, ఇండియా-స్పెక్ డస్టర్ 5-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్ల లో . 1.6-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మరియు 1.2-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌తో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, ఆటోమేకర్ అప్ కమింగ్ (రాబోయే) డస్టర్ ఎస్‌యువిని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనే రెండు ట్రాన్స్‌మిషన్లలో అందించనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప