- 2024లో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం
- రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో లభ్యంకానున్న కొత్త స్విఫ్ట్
మొత్తానికి సుజుకి కంపెనీ న్యూ-జెన్ స్విఫ్ట్ హ్యచ్ బ్యాక్ ని జపాన్ లో లాంచ్ చేసింది. ప్రస్తుతం, ఈ మోడల్ 13 కలర్ ఆప్షన్స్ తో 2 పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ గ్లోబల్ స్పెక్ సుజుకి స్విఫ్ట్ XG, హైబ్రిడ్ MX, మరియు హైబ్రిడ్ MZ అనే 3 వేరియంట్స్ లో అందించబడుతుంది.
దీని బయటి వైపు చూస్తే, కొత్త స్విఫ్ట్ యొక్క ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ రీడిజైన్ చేయబడి లేటెస్ట్ జనరేషన్ మోడల్ కంటే చాలా బెటర్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇందులో కొత్తగా మరియు చాలా స్లిమ్ గా కనిపించే గ్రిల్, రివైజ్డ్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్-షేప్డ్ ఎల్ఈడీడీఆర్ఎల్స్, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇన్వర్టెడ్-సి-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ మరియు డోర్-మౌంటెడ్ రియర్ హ్యాండిల్స్ ఉన్నాయి.
ప్రస్తుతం ఈ జపనీస్ స్విఫ్ట్ మోడల్ ఫ్రంటియర్ బ్లూ, కూల్ ఎల్లో, బర్నింగ్ రెడ్, ఫ్లేమ్ ఆరెంజ్, కారవాన్ ఐవరీ, ప్యూర్ వైట్, ప్రీమియం సిల్వర్, స్టార్ సిల్వర్, సూపర్ బ్లాక్, బ్లాక్ రూఫ్‍తోఫ్రంటియర్ బ్లూ,బ్లాక్ రూఫ్‍తోబర్నింగ్ రెడ్, బ్లాక్ రూఫ్‍తోకూల్ ఎల్లో, మరియు బ్లాక్ రూఫ్‍తో ప్యూర్ వైట్ అని మొత్తం 13 కలర్ ఆప్షన్స్ తో అందుబాటులోకి వచ్చింది.
ముందుగా దీని ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, న్యూ-జెన్ స్విఫ్ట్ లో బాలెనో మరియు ఫ్రాంక్స్ మోడల్స్ ను పోలి ఉండే రీడిజైన్డ్ క్యాబిన్ ఉంది. ఇంకా ఇందులో ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే, 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్‌వ్యూ కెమెరా, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, కీలెస్ స్టార్ట్/స్టాప్ బటన్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు ఏడీఏఎస్సూట్ వంటి హై లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి.
చివరిగా ఇందులో ఉన్న మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, కొత్త సుజుకి స్విఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మోటార్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ట్రాన్స్‌మిషన్ విధులను 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్ బాక్స్ నిర్వహించనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్