- ఈ ఏడాది చివరి నాటికి లాంచ్ అవుతుందని అంచనా
- మెకానికల్‍గా ఎలాంటి మార్పులు లేకుండా ఉండే అవకాశం
స్కోడా ఇండియా గత నెలలో ఇండియాలో న్యూ-జెన్ కొడియాక్ ఎస్‌యువి పై టెస్టింగ్ నుప్రారంభించింది. అప్పటి నుండి, ఈ మోడల్ వైట్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లో పూర్తిగా ఎవరూ ఊహించని రీతిలో టెస్ట్ రన్‌లను చేస్తూ కనిపిస్తుంది. అలాగే, న్యూ-జెన్ ఫ్లాగ్‌షిప్ స్కోడా ఎస్‌యువి ఈ ఏడాది చివరి నాటికి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
చిత్రంలో చూసినట్లుగా, ఫోర్త్-జెన్ స్కోడా కొడియాక్ సి-షేప్ లో కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ తో పూర్తిగా రీడిజైన్ చేయబడిన వెనుక ప్రొఫైల్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ తోఎక్స్‌టెండెడ్ రూఫ్ స్పాయిలర్ మరియు రివైజ్డ్ రియర్ బంపర్‌ను పొందుతుంది.
మరో వైపు, కొడియాక్ స్క్వేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్‌లతో కూడిన కొత్త అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఎస్‌యువి ఫ్రంట్ ఎండ్ దాని విస్తరించిన ఫ్రంట్ గ్రిల్, రీవర్క్ చేసిన బంపర్ మరియు రేడియేటర్ గ్రిల్ మరియు రివైజ్డ్ స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కొత్త డిజైన్‌ను కలిగి ఉండనుంది.
మెకానికల్‍గా, కొత్త ఇటరేషన్ కొడియాక్ 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ఎడబ్ల్యూడి కాన్ఫిగరేషన్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి అందించబడుతుంది. లాంచ్ అయిన తర్వాత, కొత్త స్కోడా కొడియాక్ ఇండియన్ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగున్, ఎంజి గ్లోస్టర్, టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్ మరియు హ్యుందాయ్ టక్సన్‌లతో పోటీని కొనసాగిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప