- గత సంవత్సరం అక్టోబరులో న్యూ-జెన్ స్కోడా కొడియాక్ ఆవిష్కరణ
- కొత్త ఎంక్యూబీ-ఈవీఓ ప్లాట్ ఫారం ఆధారంగా వస్తున్న న్యూ-జెన్ మోడల్
ఇండియాలో ఫోర్త్ జనరేషన్ కొడియాక్ మోడల్ ని స్కోడా ఇండియా టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న స్పై షాట్స్ లో దీని ఫస్ట్ లుక్ చూస్తే, ఈ టెస్ట్ మ్యూల్ మోడల్ వైట్ కలర్ లో ఎలాంటి కామోఫ్లేజ్ లేకుండా కనిపించింది. న్యూ-జెన్ కొడియాక్ మోడల్ ఈ ఏడాది చివరికల్లా ఇండియాలో పరిచయం చేయబడుతుందని భావిస్తున్నాం.
గత సంవత్సరం అక్టోబరులో న్యూ-జెన్ స్కోడా కొడియాక్ ఆవిష్కరించబడగా, ఈ కొత్త కొడియాక్ మోడల్ అప్ డేటెడ్ డిజైన్ పొందనుండగా, ఈ ఎస్‍యూవీ ఓవరాల్ సిల్హౌట్ ఇంతకుముందు లాగే ఉండనుంది. కారు ముందుగా భాగంలో, రివైజ్డ్ స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రీవర్క్డ్ ఫ్రంట్ బంపర్, గ్రిల్ పై బ్రషింగ్ చేయబడిన అల్యూమినియం ఫినిష్, ఎ-పిల్లర్స్ పై బ్లాక్ ఒఆర్‍విఎం, మరియు బి మరియు డి-పిల్లర్స్ పై బ్రషింగ్ చేయబడిన అల్యూమినియం ఫినిషింగ్ వంటి వాటిని పొందుతుంది.
2024 స్కోడా కొడియాక్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది కొత్త అల్లాయ్ వీల్స్, అదే విధంగా ఇంతకు ముందు చూసినవి కాకుండా ఫ్రెష్ సి-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, టెయిల్ గేట్ పై స్కోడా లెటరింగ్, మరియు రీడిజైన్డ్ రియర్ బంపర్ వంటి వాటితో బెస్ట్ లుక్ ని అందుకోనుంది. ఈ మోడల్ కొత్త కలర్లలో కూడా అందుబాటులోకి వస్తుందని మేము భావిస్తున్నాం.
ఇంటీరియర్ పరంగా, కొత్త కొడియాక్ లోపల చూస్తే, ఇది అచ్చం న్యూ-జెన్ స్కోడా సూపర్బ్ మోడల్ లా అనిపిస్తుంది. దీని లోపల డ్యూయల్-టోన్ బ్రౌన్ మరియు బ్లాక్ థీమ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, మరియు మరెన్నో ఉండనున్నాయి. ఇందులో గుర్తించాల్సిన ఇతర ఫీచర్లలో 10-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 13-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, మరియు ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టయోటా ఫార్చునర్, ఎంజి గ్లోస్టర్, మరియు జీప్ మెరిడియన్ వంటి వాటితో పోటీపడనున్న ఈ మోడల్ బానెట్ కింద ఇంతకు ముందు జనరేషన్ లాగే 2.0-లీటర్, 4-సిలిండర్, టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ డిసిటి యూనిట్ తో జతచేయబడి 187bhp మరియు 320Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్