మొత్తానికి సుజుకి టోక్యోలో జరిగిన 2023 జపాన్ మొబిలిటీ షోలో సరికొత్త ఫోర్త్-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ ని ఆవిష్కరించింది. ఈ ఇండియన్ బౌండ్ హ్యచ్ బ్యాక్ లోని ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ లో మరికొన్ని ఫీచర్స్ ని జత చేసింది. ఈ ఆర్టికల్ లో మేము త్వరలో ఇండియాకి రానున్న న్యూ-జెన్ సుజుకి స్విఫ్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలను మీకు తెలియజేయబోతున్నాము.
ఎక్స్‌టీరియర్
ముందుగా దీని డిజైన్ గురించి చెప్పడం ప్రారంభిస్తే, ఈ స్విఫ్ట్ రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్స్ తో రానుంది. అలాగే ఫీచర్స్ లో బ్లాక్ సరౌండ్స్ తో కొత్త గ్లోస్ బ్లాక్ మెష్-ప్యాటర్న్డ్ గ్రిల్, రీపొజిషన్ చేయబడిన సుజుకి లోగో, ఇన్వర్టెడ్ ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో స్లీకర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, సిల్వర్ ఫినిష్ తో ఆర్టిఫిషియల్ స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయి. దీని సైడ్స్ గురించి మాట్లాడితే, కొత్తగా సైడ్ స్కర్ట్స్ తో 16-ఇంచ్ అల్లాయ్స్ ఉన్నాయి. అలాగే, ఈ ఆటోమేకర్ పిల్లర్ నుంచి డోర్ వరకు రియర్ డోర్ హ్యండిల్స్ ని రీపొజిషన్ చేసింది. అన్నీ డోర్ ప్యానెల్స్ నుంచి టెయిల్ గేట్ వరకు అంతటా ఒక లైన్ లాంటి క్రీజ్ ని కలిగి ఉంది.
అక్కడ జరిగిన ఈవెంట్ లో బ్లూ మెటాలిక్ పెయింట్ తో కాంట్రాస్టింగ్ బ్లాక్ రూఫ్ మోడల్ ను మారుతి సుజుకి ప్రదర్శించింది. ముందు భాగం చూస్తే, ఇంతకు ముందులాగే టెయిల్ ల్యాంప్స్ షేప్ ఉంది. అదే విధంగా ఇది బ్లాక్ సరౌండ్స్ తో ఇన్వర్టెడ్ సి-షేప్డ్ ఎల్ఈడీ లేఅవుట్ తో స్పోర్ట్స్ లుక్ ని కలిగి ఉంది. మనకు కనిపిస్తున్న ఇతర హైలెట్స్ లో రియర్ వైపర్, రీడిజైన్డ్ బ్లాక్డ్ - అవుట్ రియర్ బంపర్, సెన్సార్స్ తో కూడిన రియర్ కెమెరా, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ మరియు ఒక ట్రెడిషనల్ రేడియో యాంటెన్నా ఉన్నాయి.
ఇంటీరియర్
ఇంటీరియర్ పరంగా చూస్తే, కొత్త స్విఫ్ట్ క్యాబిన్ అచ్చం బాలెనో మరియు ఫ్రాంక్స్ లాగే ఉంది. అలాగే, ఇందులో ఫ్రీ-స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, రీడిజైన్డ్ ఎయిర్ కాన్ వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీ లెస్ స్టార్ట్/స్టాప్ బటన్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్, మరియు చిన్న ఎంఐడితో కూడిన అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్స్ గురించిన చెప్పాలంటే, గ్లోబల్ వెర్షన్ లో వస్తున్న కొత్త స్విఫ్ట్ లో 6-ఎయిర్ బ్యాగ్స్, ఫుల్ ఎల్ఈడీ లైట్ సెటప్, లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, మరియు డ్రైవర్ మానిటరింగ్ సిస్టం ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్స్
ఇంకా ఇందులో పెద్ద హైలైట్ ఏంటి అంటే, 2024 సుజుకి స్విఫ్ట్ కొత్త మైల్డ్ హైబ్రిడ్ టెక్ తో రానుంది. అయితే, ఇండియాలో మాత్రం 1.2-లీటర్ కె సిరీస్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్స్ తో జత చేయబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఇండియాలో ఈ మోడల్ పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్ ట్రెయిన్ ఆప్షన్ లో అమ్ముడవుతుంది.
లాంచ్ డేట్ మరియు పోటీ
ఫోర్త్-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ ఇండియాలో 2024 ద్వితీయార్థంలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. దీనికి పోటీగా ఉన్న వాటి గురించి చెప్పాలంటే, కొత్త స్విఫ్ట్ కి టాటా టియాగో, టాటా అల్ట్రోజ్, హ్యుందాయ్, గ్రాండ్ ఐ10 నియోస్, రెనాల్ట్ కైగర్, టయోటా గ్లాంజా, మరియు మారుతి సుజుకి బాలెనో వంటివి పోటీగా ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్