- డ్రైవింగ్ టెస్టులను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం
- ఇప్పుడు మరింత సులభతరం కానున్న అప్లికేషన్ ప్రాసెస్
జూన్ 1, 2024 నుండి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ ని తీసుకువస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పుడు కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ కి అనుగుణంగా ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత సౌకర్యవంతంగా మారనుంది. కొత్త రూల్స్ రాకతో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు ప్రైవేట్ డ్రైవింగ్ ట్రెయినింగ్ సెంటర్లలో తమ డ్రైవింగ్ టెస్టును తీసుకునే అవకాశం ఉంటుంది, ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రాంతీయ రవాణా కార్యాలయాలను (ఆర్టీవోలు) అనుసంధానించి సాంప్రదాయ పద్ధతికి స్వస్తి పలికి గణనీయమైన మార్పును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈ ప్రక్రియ ద్వారా ఇకపై మీరు ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి డ్రైవింగ్ కోసం టెస్ట్ డ్రైవ్ చేయవలసిన పనిలేదు. ఆర్టీవో ఆఫీసుకు బదులుగా మీరు ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్లలో డ్రైవింగ్ టెస్ట్కు హాజరు కావచ్చు. అక్కడ మీకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి మీ చేతికి ఒక అర్హత సర్టిఫికెట్ ని అందిస్తారు. దాని ద్వారా మీరు ఆర్టీవో ఆఫీసుకు వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారు. ఇకపై ఈ సర్వీసులు పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించబడతాయి.
డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అర్హతలు
కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ ఎలా ఉన్నాయంటే, ఒకవేళ మీరు లైట్ మోటార్ వెహికల్ ట్రైనింగ్ పొందుతుంటే మీరు ఆ ట్రైనింగ్ ని 29 గంటల్లోపు పూర్తి చేయాలి. ఇంకో విషయం ఏంటి అంటే ఈ ట్రైనింగ్ లో ఎనిమిది గంటలు థియరీ కోసం 21 గంటలు ప్రాక్టికల్ డ్రైవింగ్ కోసం మీరు కేటాయించాల్సి ఉంటుంది. హెవీ మోటార్ వెహికిల్స్ లైసెన్స్ పొందాలంటే మీరు కనీసం ఆరు వారాలు లేదా 38 గంటలపాటు ట్రైనింగ్ తీసుకొని ఉండాలి అందులో ఎనిమిది గంటలు థియరీ కోసం మరో 30 గంటలు డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది.
డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులు
లెర్నర్ లైసెన్స్ - రూ. 200
లెర్నర్ లైసెన్స్ రెన్యూవల్ - రూ. 200
ఇంటర్నేషనల్ లైసెన్స్ - రూ. 1000
పర్మనెంట్ లైసెన్స్ - రూ. 200
పర్మనెంట్ లైసెన్స్ రెన్యూవల్ - రూ. 200