- ఇండియాలో రూ. 7.99 లక్షల తో ప్రారంభమైన బసాల్ట్ ధరలు
- రెండు ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉన్న మోడల్
సిట్రోన్ బసాల్ట్ కూపే ఎస్‍యూవీ బేస్ వేరియంట్ ధరను ప్రకటించింది, దీని ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఆటో మేకర్ దాని లైనప్ లోఉన్న మొత్తం వేరియంట్ ధరలను వెల్లడిస్తుందని మేము వేచి చూస్తున్న సమయంలో, బేస్ వేరియంట్ లో లభించే ఫీచర్లను వెల్లడించింది.
ఇక్కడ ఉన్న చిత్రాలలో చూసినట్లుగా, సిట్రోన్ బసాల్ట్ బేస్ వెర్షన్, 1.2 యు వేరియంట్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, హాలోజన్ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎలాంటి వీల్స్ కవర్లు లేకుండా స్టీల్ వీల్స్ వంటి ఫీచర్లను పొందుతుంది. అంతేకాకుండా, బ్లాక్- అవుట్ స్కిడ్ ప్లేట్స్ మరియు డోర్ హ్యాండిల్స్, ఒఆర్‍విఎంస్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌ను కూడా పొందుతుంది. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఇది అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్కిడ్ ప్లేట్‌కు సిల్వర్ ఫినిషింగ్, డోర్ మరియు వీల్ క్లాడింగ్, ఫాగ్ లైట్స్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నాలను మిస్ అవుతుంది.
లోపలి భాగంలో, సిట్రోన్ బసాల్ట్ బేస్ వేరియంట్ కారు డిజిటల్, కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఫ్రంట్ పవర్ విండోస్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, బ్లాక్ అండ్ గ్రే అప్హోల్స్టరీ, ఫ్రంట్ ట్వీటర్స్ మరియు స్పీకర్స్, 12V పోర్ట్, ఫ్రంట్ కప్ హోల్డర్స్ మరియు హెడ్‌రెస్ట్‌స్ వంటివి ఉన్నాయి. అలాగే ఇక్కడ గుర్తించదగిన అంశాలు ఏమిటంటే, టాప్-స్పెక్ మ్యాక్స్ వేరియంట్‌తో పోల్చినప్పుడు ఇది మిస్ అవుతున్న ముఖ్యమైన ఫీచర్లలో ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రెండవ వరుసకు త్రీ-స్టెప్ అడ్జస్టబుల్ (తొడ) సపోర్ట్, ఫ్లిప్ కీ, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ఆపిల్ కార్‌ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ మరియు పవర్డ్ ఒఆర్‍విఎంఎస్ వంటివి ఉన్నాయి.
సిట్రోన్ బసాల్ట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బోచార్జ్డ్ రూపాల్లో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే జత చేయబడింది. ఇక్కడ బేస్ వేరియంట్ టాప్-స్పెక్ వేరియంట్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ను కూడా పొందుతుంది. అలాగే, మేము బసాల్ట్ కూపే ఎస్‌యూవీని డ్రైవ్ చేసిన రివ్యూ మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప