పండుగ సీజన్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇండియన్ మార్కెట్లో వచ్చే నెలలో కొత్త కార్ల లాంచ్‌లు ఉన్నాయి. ఆ ఎస్‌యువిలు లేదా సెడాన్‌లు, ఐసీఈలేదా ఈవీలు, మాస్ మార్కెట్ లేదా లగ్జరీ సెగ్మెంట్లలో ఉండవచ్చు, సెప్టెంబర్‌లో లాంచ్ కానున్నఈ సెగ్మెంట్‌లలో ఒక్కో కారు వివరాలు మేము ఈ ఆర్టికల్ లో రాశాము. అవి ఏమిటో చూద్దాం.
టాటా కర్వ్ ఐసీఈ
టాటా మోటార్స్ ఈ నెల ప్రారంభంలో కర్వ్ ఈవీని పరిచయం చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ 2నఐసీఈ-ఐసీఈ-బేస్ డెరివేటివ్‌ల ధరలను కూడా వెల్లడించనుంది. కర్వ్ బ్రాండ్ కంపెనీ కొత్త ఈవీ-మొదటి లక్ష్యాన్ని సాధించడానికి సూచిస్తుంది. ఇక్కడ అది ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధిత ఐసీఈ వెర్షన్‌ను కూడా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
హుడ్ కింద, కర్వ్1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-టిజిడిఐ టర్బో-పెట్రోల్- మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లతోఅందించబడుతుంది. ఇందులోట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ని పరిశీలిస్తే, అన్ని మోటార్‌లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిఎ గేర్‌బాక్స్ యూనిట్‌లను కలిగి ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే, ఇండియన్ మార్కెట్లోకర్వ్డీజిల్-డిసిటి యూనిట్‌లతో కొనసాగుతున్నమొదటి కారు.
మెర్సిడెస్-మేబాక్ EQS
సెప్టెంబర్ 5వ తేదీన మెర్సిడెస్-బెంజ్ ఇండియా లోకల్ మార్కెట్లో కొత్త EQS మేబాక్ ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. గత సంవత్సరం చైనాలో మొదటిసారిగా ప్రదర్శించబడిన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి చుట్టూ ఉన్న మేబాక్ లోగోలతో ఉంటుంది. దీని చుట్టూ అనేక క్రోమ్ ఇన్సర్ట్స్ మరియు (లార్జ్ ఫ్లాష్) మరింత మెరుస్తూ ఉండే అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఇంటీరియర్‌లో మేబాక్-స్పెసిఫికేషన్స్ ఇన్సర్ట్స్ మరియు గ్రాఫిక్‌లతో పాటు చాలా వరకు పాత EQS ఎస్‌యువి థీమ్ ను కలిగి ఉంటుండగా, రెండవ వరుసలో MBUX టాబ్లెట్ మరియు వెనుక సీటు ప్రయాణీకుల కోసం రెండు 11.6-ఇంచ్ స్క్రీన్‌లు ఉన్నాయి. ఇది 108.4kWh బ్యాటరీ ప్యాక్‌తో డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా కారు 4 వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది. పవర్ అవుట్‌పుట్ విషయానికి వస్తే, ఇది 658bhp మరియు 950Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే, 600 కిలోమీటర్ల వరకు క్లెయిమ్ రేంజ్‌ని అందిస్తుంది.
హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్
కొరియన్ ఆటోమేకర్ నుంచి వస్తున్నఫేస్‌లిఫ్టెడ్ అల్కాజార్ ఎక్స్‌టీరియర్ డిజైన్ వివరాలు కార్ వాలే వెబ్ సైటులో ఇంతకు ముందే వెల్లడైయ్యాయి. అలాగే, అప్‌డేటెడ్ మూడు-వరుసల ఎస్‌యువి ఫేస్‌లిఫ్టెడ్ అల్కాజార్ ని కొనుగోలు చేయాలని ఆసక్తి కలిగిన కస్టమర్లు టోకెన్ అమౌంట్ మొత్తం రూ. 25,000 చెల్లించి అధికారికంగా బుక్ చేసుకోవచ్చు. మహీంద్రా XUV700, కియా కారెన్స్ మరియు టాటా సఫారికి పోటీగా ఉన్నఈ మోడల్ ధరలు సెప్టెంబర్ 9వ తేదీన వెల్లడి కానున్నాయి.
ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో మార్పులతో పాటు, 2024 అల్కాజార్ రెండు పెద్ద స్క్రీన్‌లు, ఏడీఏఎస్ (ఎడాస్)సూట్, కొత్త అప్హోల్స్టరీ మరియు మరిన్నింటితో అప్‌డేట్ చేయబడిన ఫీచర్ లిస్ట్ ని కూడా కలిగి ఉంది. ఇది అవుట్‌గోయింగ్ కారు వలె 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్డిసిటిమరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లతో జత చేయబడిన అదే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లను కొనసాగిస్తుంది.
ఎంజి విండ్‍సర్ ఈవీ
విండ్‍సర్ ఈవీ, ఇది అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయించబడుతున్న వులింగ్ క్లౌడ్ ఈవీ రీబ్యాడ్జ్ వెర్షన్, కొత్త ఎంజి విండ్‍సర్ ఈవీ ఇండియాలో 2024 సెప్టెంబర్ 11వ తేదీన లాంచ్ కాబోతుంది. త్వరలో రాబోయే ఈ కారు ధరలను ఎంజి మోటార్ జెఎస్ డబ్లూ ఇండియా ప్రకటించనుంది. రెండింటి సహకారంతో సంయుక్తంగా లాంచ్ కాబోతున్న మొదటి కారు ఇదే.
ఎల్‌ఈడీ లైట్ బార్స్, పనోరమిక్ సన్‌రూఫ్, స్టీరింగ్ వీల్ మరియు వెనుక సీటు ప్యాకేజీ వంటి కీలక ఫీచర్లను వెల్లడిస్తూ ఎంజి పలు సందర్భాల్లో కారు టీజర్లను రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందించబడుతుంది. వీటిలో ఏది ఇండియా-స్పెక్ కారులో లభిస్తుంది అనేది తెలియని విషయం. దీని బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 460కిలోమీటర్ల రేంజ్ ని అందించే అవకాశం ఉంది.
న్యూ మారుతి డిజైర్
ఇండియాలో కొత్త స్విఫ్ట్ రాకతోనెక్స్ట్ - జెన్డిజైర్ రాక కూడా ఎంతో దూరంలో లేదు. అప్‌డేట్ ద్వారా ఈ కారు హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ మరియు టాటా టిగోర్‌లను కలిగి ఉన్న సబ్-ఫోర్-మీటర్ సెడాన్ సెగ్మెంట్‌లో సరికొత్తగా నిలవనుంది.
మునుపటి స్పై చిత్రాలను చూస్తే 2024 డిజైర్ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, అప్‌డేట్ చేయబడిన స్విఫ్ట్‌కి అనుగుణంగా కొత్త డిజైన్ మరియు మరిన్నింటితో వస్తుందని నిర్ధారించాయి. ఇది తాజా 1.2-లీటర్, Z12E పెట్రోల్ ఇంజిన్ నుండి 80bhp మరియు 112Nm టార్క్ ను అందిస్తుంది. ఇది 5 -స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ల ద్వారా (ముందు) ఫ్రంట్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
టాటా నెక్సాన్ సిఎన్‌జి
ఈ సంవత్సరంలో టాటా నుంచి వస్తున్న కార్ లాంచ్‌ల లెక్క ఇంకా పూర్తి కాలేదు. టాటా కర్వ్ మరియు ఐసీఈ డెరివేటివ్‌ల తర్వాత, స్థానికంగా ఉత్పత్తి చేయబడిన కంపెనీ సిఎన్‌జి వెర్షన్ లాంచ్ తో నెక్సాన్ రేంజ్ మరింత మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో నెక్సాన్ సిఎన్‌జి ప్రదర్శించబడింది. ఇది ఇండియన్ మార్కెట్లో అందించబడుతున్న మొదటి టర్బో-పెట్రోల్-సిఎన్‌జి కారుగా ఉంటుంది.
ప్రస్తుతానికి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తెలియనప్పటికీ, పవర్ అవుట్‌పుట్ స్టాండర్డ్ వెర్షన్ వలె పెట్రోల్ మోడ్‌లో అలాగే ఉంటుందని భావించవచ్చు. ఇది డ్యూయల్ సిఎన్‌జి సిలిండర్ ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుంది. లాంచ్ తర్వాత, పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి మరియు ఈవీ తో సహా ఎక్కువ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ కలిగి ఉన్న కారుగా ఇది నిలిచిపోతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప