మే నెల వేసవితో పాటుగా కార్ల లాంచ్ తో మరింత వేడెక్కుతుంది. ఇదే నెలలో వివిధ ఆటో కంపెనీలకు చెందిన దిగ్గజ బ్రాండ్లు ఆయా మోడళ్లను లాంచ్ చేయనున్నాయి. తాజాగా ఇండియాలోరూ. 16.75 లక్షల ధరతో 2024 ఫోర్స్ గూర్ఖా మరియు రూ.21.20 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో 2024 ఇసుజు D-మ్యాక్స్ V-క్రాస్ మోడల్స్ లాంచ్ అయ్యాయి. అదే విధంగా, న్యూ-జెన్ మారుతి స్విఫ్ట్, టాటా నెక్సాన్ ఐసిఎన్‍జి, కొత్త పోర్షే పనామెరా మోడల్స్ ఇదే నెలలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం, లాంచ్ కాబోతున్న వివిధ మోడల్స్ పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
న్యూ-జెన్ మారుతి స్విఫ్ట్
ఈ వారం ప్రారంభంలో, మారుతి సుజుకి రూ.11,000 బుకింగ్ అమౌంట్ తో కొత్త స్విఫ్ట్ బుకింగ్స్ ని ప్రారంభించింది. ఈ ఫోర్త్ జనరేషన్ మోడల్ ఈ నెల 9న అనగా రెండు రోజుల తర్వాత లాంచ్ కానుండగా, వివిధ వీడియోల ద్వారా ఎన్నోసార్లు టీజ్ చేయబడింది. ఈ మోడల్ టీజర్లు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.
లీకైన డేటా ప్రకారం, 2024 స్విఫ్ట్ కొత్త 1.2-లీటర్, 3-సిలిండర్, Z12E పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. ఇంతకు ముందున్న పవర్ ట్రెయిన్ తో రానుండగా ఇది హైబ్రిడ్ మోటారుతో వస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.
టాటా నెక్సాన్ ఐసిఎన్‍జి
ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో టాటా మోటార్స్ నెక్సాన్ ఐసిఎన్‍జిని ప్రదర్శించింది. ప్రస్తుతం, నెక్సాన్ మోడల్ పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో అందించబడుతుండగా, ఇప్పుడు కొత్తగా సిఎన్‍జి వెర్షన్లో కూడా రానుంది. దీంతో నెక్సాన్ ఇప్పుడు అన్ని పవర్ ట్రెయిన్లలో అందించబడుతుంది.
మారుతి బ్రెజా మాత్రమే కాకుండా, నెక్సాన్ కు పోటీగా సోనెట్, వెన్యూ, కైగర్, మరియు ఇప్పుడు XUV 3XO వంటి మోడల్స్ కూడా సిఎన్‍జి పవర్ ట్రెయిన్ ని అందిస్తున్నాయి. అదే విధంగా ఫ్రాంక్స్ మరియు టైజర్ మోడల్స్ కూడా సిఎన్‍జి వెర్షన్లో రానున్నాయి. నెక్సాన్ సిఎన్‍జి మోడల్ కి సంబంధించిన పూర్తి వివరాలను మా వెబ్ సైట్ లో అందించాము, మీరు వాటిని చదువవచ్చు.
కొత్త పోర్షే పనామెరా
గత సంవత్సరం చివరలో, కొత్త పోర్షే పనామెరా రూ. 1.68 కోట్ల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ థర్డ్ జనరేషన్ వెర్షన్ వివిధ అప్ గ్రేడ్లతో పాటుగా, పవర్ ట్రెయిన్ డిపార్టుమెంట్లో చిన్న చిన్న మార్పులను తీసుకువచ్చింది.
మా డీలర్లు అందించిన సమాచారం ప్రకారం, ఈ మోడల్ లాంచ్ ఈవెంట్ త్వరలో ఉండనుంది. దీని ద్వారా మరిన్ని కొత్త ఫ్రెష్ ఫీచర్లు మరియు ధరలో మార్పులు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మరియు లేటెస్ట్ అప్ డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వెబ్ సైట్ ని మరియు సోషల్ మీడియా ఛానెళ్ళను సందర్శించగలరు.