ఈ నెల ప్రారంభంలో వివిధ కంపెనీలకు చెందిన కార్లు లాంచ్ కాగా, తాజాగా అందులో భాగంలో ఏప్రిల్ 2024 నెల కొత్త కార్ల లిస్టును మీకు అందించడానికి మేము ఎదురుచూస్తున్నాము. ఈ నెల వివిధ సెగ్మెంట్లలో, ఆయా ధరల రేంజ్ లో మరిన్ని కార్లు లాంచ్ కానున్నాయి. రాబోయే (అప్‍కమింగ్) కార్లలో ప్రతి ఒక్క కారు గురించి పూర్తిగా తెలుసుకుందాం.
టయోటా అర్బన్ క్రూజర్ టైసర్
అర్బన్ క్రూజర్ టైసర్ టయోటా ఫ్రాంక్స్ కూపే ఎస్‍యూవీ వెర్షన్, ఈ మోడల్ లాంచ్ ఏప్రిల్ 3, 2024న జరగనుంది. మారుతి బాలెనో-బేస్డ్ మోడల్ మొత్తం ఫార్ములాలోని కొన్ని అంశాలు బట్టి చూస్తే, ఇది వేరుగా ఉండవచ్చని మేము భావిస్తున్నాము.
డిజైన్ పరంగా, కొత్త టైజర్ రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ట్వీక్డ్ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్ మరియు తాజా అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నాం. ఇక ఇంటీరియర్‌లో మార్పుల విషయానికి వస్తే, కొత్త అప్హోల్స్టరీతో కాకుండా రివైజ్డ్ ఫీచర్ లిస్ట్ రూపంలో ఇది వచ్చే అవకాశం ఉంది. హుడ్ కింద, 1.2-లీటర్ ఎన్ఎపెట్రోల్ మోటారుతో అందించబడుతుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ లేదా ఎఎంటి యూనిట్‌తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, సిఎన్‍జి వెర్షన్లో కూడా రావచ్చు.
ఫోక్స్‌వ్యాగన్ టైగున్ జిటి ప్లస్ స్పోర్ట్
ఈ నెల ప్రారంభంలో జరిగిన బ్రాండ్ వార్షిక సదస్సులో ప్రదర్శించబడిన మూడు మోడళ్లలో టైగున్ జిటి ప్లస్ స్పోర్ట్ కార్ ఒకటి. ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటి వరకు లాంచ్ చేసే తేదీని తెలుపనప్పటికి, టైగున్ జిటి ప్లస్ స్పోర్ట్ ఏప్రిల్ 2024లో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
స్టాండర్డ్ టైగున్‌తో పోలిస్తే, జిటి ప్లస్ స్పోర్ట్ వేరియంట్ కార్బన్ స్టీల్ గ్రే రూఫ్, డార్క్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 17-ఇంచ్ బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ యాక్సిల్‌లో రెడ్ బ్రేక్ కాలిపర్స్ మరియు బ్లాక్-అవుట్ రూపంలో చిన్నపాటి కాస్మటిక్ అప్‌డేట్‌లను పొందుతుంది. చాలా వరకు కారులోని ఇతర భాగాలపై బ్లాక్డ్ –అవుట్ ఫినిషింగ్ పొందింది. లోపల, ఇది కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్, స్పోర్ట్ స్టీరింగ్ వీల్, అల్యూమినియం పెడల్స్ మరియు ఫ్రంట్ సీట్ బ్యాక్‌రెస్ట్‌లో ఎంబ్రాయిడరీతో GT లోగోతో బ్లాక్ అప్హోల్స్టరీ వంటి వాటిని పొందనుంది.
ఫోర్స్ గూర్ఖా 5-డోర్
ఫోర్స్ మోటార్స్ ఈ నెలాఖరులో గూర్ఖా 5-డోర్ ఇటరేషన్ ని లాంచ్ చేయడానికి అన్నీ సిద్ధం చేస్తుంది. 2024 ఏప్రిల్ 23 మరియు 26 మధ్య జరిగే మీడియా డ్రైవ్స్ కోసం ఆటోమేకర్ ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలను కూడా పంపింది.
హుడ్ కింద, 5-డోర్ గూర్ఖా దాని 3-డోర్ లో మనం చూసిన అదే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను పొందవచ్చని భావిస్తున్నాం, అయినా సరే ఇది కొంచెం హయ్యర్ ట్యూన్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజన్ ప్రస్తుతం 90bhp/250Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. లాంచ్ తర్వాత, 5-డోర్ ఫోర్స్ గూర్ఖా 2024 ద్వితీయార్థంలో రావడానికి సిద్ధంగా ఉన్న 5-డోర్ థార్‌తో పోటీ పడేఅవకాశం ఉంది.
మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్ పై కొంతకాలంగా టెస్టింగ్ కొనసాగుతుంది. ఈ ప్రొడక్షన్ రెడీ కారు స్పై షాట్స్ చూస్తే లాంచ్ పెద్ద దూరంలో లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇది మాన్యువల్ మరియు ఎఎంటియూనిట్లతో జత చేయబడిన 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ల సెట్‌తో రానుంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్ పరంగా, మార్పుల విషయానికి వస్తే, ఈ మోడల్ రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, తాజా అల్లాయ్ వీల్స్ సెట్, పెద్ద ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏడీఏఎస్(ఎడాస్)సూట్ మరియు కొత్త అప్హోల్స్టరీ వంటి మార్పులతో వస్తుంది.
మారుతి సుజుకి స్విఫ్ట్
నవంబర్‌లో టోక్యోలో జరిగిన 2023 జపనీస్ మొబిలిటీ షోలో ఆవిష్కరించబడిన న్యూ-జెన్ స్విఫ్ట్ ఈ నెలాఖరులో ఇండియాలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ అప్‌డేటెడ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టెస్ట్ మ్యూల్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేయబడుతున్నాయి.
కొత్త స్విఫ్ట్ బయటివైపుహెడ్ల్యాంప్స్, గ్రిల్, బంపర్స్, వీల్స్, టెయిల్‌లైట్స్ మరియు సి-పిల్లర్ నుండి రియర్ డోర్ హ్యాండిల్‌ను డోర్‌కు రీపొజిషన్ చేయడం వంటి కొత్త అంశాలతో పూర్తి కొత్త డిజైన్ ని పొందుతుంది. అలాగే ఇందులో కొత్త టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-2 ఏడీఏఎస్(ఎడాస్)సూట్ మరియు రీడిజైన్డ్ ఎయిర్ వెంట్స్ కూడా అందించబడనున్నాయి. ఇంకా, ఈ కారు కొత్త 1.2-లీటర్, మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ మోటార్‌తో జత చేయబడి, సివిటి యూనిట్ ద్వారా వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
ఎంజి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్
గ్లోస్టర్ మూడు-వరుసల ఎస్‍యూవీ మైనర్ అప్‌డేట్స్ ఎంజి ప్రధానంగా ఫోకస్ చేస్తోంది, ఇది ఇండియాలో లాంచ్ అయినప్పటినుండి దాని రేంజ్ లో ఇప్పటివరకు ఎలాంటి అప్‍డేట్స్ అందుకోలేదు. రిఫ్రెష్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త గ్రిల్ మరియు ఎల్ఈడీ టెయిల్‌లైట్లు మరియు డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ అప్ గ్రేడ్స్ తో వస్తుందని మేము భావిస్తున్నాము.
2024 గ్లోస్టర్ ఇంటీరియర్‌లో చోటుచేసుకున్న మార్పుల వివరాలు ప్రస్తుతానికైతే తెలియరాలేదు. ఈ మోడల్ టర్బో మరియు ట్విన్-టర్బో ఫార్మాట్‌లలోని అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్లతో వచ్చే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత, అప్‌డేటెడ్ గ్లోస్టర్ జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు టయోటా ఫార్చూనర్‌లకు పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్