- అదనపు సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన 2024 అప్‍డేటెడ్ మోడల్స్
- 3 వేరియంట్లు, 2 ఇంజిన్ ఆప్షన్లలో అందించబడుతున్న రెండు కార్లు
స్కోడా ఆటో ఇండియా 2024 కుషాక్ మరియు స్లావియా కార్లను వరుసగా రూ.11.64 లక్షలు (ఎక్స్-షోరూం) మరియు రూ.11.99 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అప్‍డేట్ లో భాగంగా, వేరియంట్ రేంజ్ లో ఈ రెండు కార్లు 6-ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా పొందాయి. ముఖ్యంగా, ఈ రెండు కార్లు 2022లో గ్లోబల్ ఎన్ క్యాప్ ద్వారా నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ ని అందుకున్నాయి.
స్కోడా కంపెనీ కుషాక్ మరియు స్లావియా మోడళ్లను యాక్టివ్, యాంబిషన్, మరియు స్టైల్ అనే మూడు వేరియంట్లలో అందిస్తుంది. కస్టమర్లు వీటిని 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిఎస్‍జి ట్రాన్స్‌మిషన్లలో 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ నుంచి ఎంచుకోవచ్చు.
2023 చివరి త్రైమాసికంలో, స్కోడా కంపెనీ కుషాక్ మరియు స్లావియా టాప్-స్పెక్ వేరియంట్లలో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. వాటిలో అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ మరియు యాంబియంట్ ఫుట్ వెల్ లైటింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రస్తుతం, కార్ మేకర్ కాంపాక్ట్ ఎస్‍యూవీపై వర్క్ చేస్తుండగా, వచ్చే సంవత్సరం ప్రారంభంలో దీనిని ఇండియన్ మార్కెట్లో పరిచయం చేయనుంది.
వేరియంట్-వారీగా 2024 స్కోడా కుషాక్ మరియు స్లావియా మోడల్స్ ధరలు కింది విధంగా ఉన్నాయి:
2024 కుషాక్ | ఎక్స్-షోరూం ధర | |
యాక్టివ్ | 1.0 టిఎస్ఐ ఎంటి | రూ. 11.99 లక్షలు |
1.0 ఎంటి ఎంటి ఓనిక్స్ | రూ.12.89 లక్షలు | |
యాంబిషన్ | 1.0 ఎంటి ఎంటి | రూ.14.54 లక్షలు |
1.0 టిఎస్ఐ ఎటి | రూ.15.84 లక్షలు | |
స్టైల్ | 1.0 టిఎస్ఐ ఎంటి | రూ.16.59 లక్షలు |
1.0 టిఎస్ఐ ఎటి | రూ.17.89 లక్షలు | |
1.5 టిఎస్ఐ ఎంటి | రూ.18.39 లక్షలు | |
1.5 టిఎస్ఐ డిఎస్‍జి | రూ.19.79 లక్షలు | |
2024 స్లావియా | ఎక్స్-షోరూం ధర | |
యాక్టివ్ | 1.0 టిఎస్ఐ ఎంటి | రూ.11.63 లక్షలు |
యాంబిషన్ | 1.0 టిఎస్ఐ ఎంటి | రూ.13.78 లక్షలు |
1.0 టిఎస్ఐ ఎటి | రూ.15.08 లక్షలు | |
స్టైల్ | 1.0 టిఎస్ఐ ఎంటి | రూ.15.63 లక్షలు |
1.0 టిఎస్ఐ ఎటి | రూ.16.93 లక్షలు | |
1.5 టిఎస్ఐ ఎంటి | రూ.17.43 లక్షలు | |
1.5 టిఎస్ఐ డిఎస్‍జి | రూ.18.83 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్