- ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు రెండు వెర్షన్లలో లభ్యం
- సెప్టెంబరులో వీటి డెలివరీ ప్రారంభం
బిఎండబ్లూ ఇండియా రెండు మినీ మోడళ్లను మరియు 8వ జనరేషన్ బిఎండబ్లూ 5 సిరీస్ ని నేడే ఇండియాలో లాంచ్ చేసింది. న్యూ జనరేషన్ కూపర్ ఎస్ మరియు కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ అనే ఈ రెండు మోడల్స్ ఎక్స్ షోరూం ధర వరుసగా రూ. 44.9 లక్షలు మరియురూ. 54.9 లక్షలుగా ఉంది.
మినీ కూపర్ ఎస్ లాంచ్ వివరాలు
చిన్న చిన్న కాస్మోటిక్ మార్పులు, కొత్త ఫీచర్లను కొత్త కూపర్ ఎస్ పొందగా, ఇది క్లాసిక్ మరియు ఫ్లేవర్డ్ ప్యాక్స్ అనే రెండు వెర్షన్లలో అందించబడింది. కొత్త కూపర్ ఎస్ లోని హైలైట్ ఫీచర్లలో డిజిటల్ ఓఎల్ఈడీటచ్‌స్క్రీన్, మినీ 9ఆపరేటింగ్ సిస్టం, మినీ ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్, డిజిటల్ కీ ప్లస్ మరియు ఫిష్ ఐ కెమెరా వంటివి ఉన్నాయి. ఈ ఇండియా-స్పెక్ మోడల్ లేటెస్ట్ ఇటరేషన్ కాగా, గత సంవత్సరం సెప్టెంబరు నెలలో గ్లోబల్ గా ప్రదర్శించబడింది. ఈ కారులో అందించబడిన 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 201bhp మరియు 300Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా కూపర్ ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్ గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూపర్ ఈ మరియు కూపర్ ఎస్ఈ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఇప్పుడు క్లాసిక్ మరియు ఫ్లేవర్డ్ ప్యాక్స్ లో వచ్చిన కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ కారు
రిఫ్రెష్డ్ మినీ మోడల్స్ ఎన్నో ఉండగా, వాటి మధ్యన ఉన్న కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ కారు మొదటిసారిగా ఇండియాలో లాంచ్ అయింది. కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ కారు దాని బేసిక్ స్ట్రక్చర్ ని బిఎండబ్లూ iX1తో షేర్ చేసుకుంటుండగా, ఇది 66.45kWh బ్యాటరీ ప్యాక్ తో అందించబడింది. దీనిని డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 29 నిమిషాల్లోనే 10-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే ఇది డబ్లూఎల్టీపీ ద్వారా క్లెయిమ్ చేయబడిన 462 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. ఇందులో అందించబడిన ఇంజిన్ 201bhp మరియు 250Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, ఇది కేవలం 8.6 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్