- ఇంటర్నేషనల్ మార్కెట్లలో క్లౌడ్ ఈవీగా విక్రయించబడుతున్న మోడల్
- రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందించే అవకాశం
జెఎస్ డబ్లూ ఎంజి మోటార్ ఇండియా సెప్టెంబర్‌లో విండ్‍సర్ ఈవీ అనే కొత్త మోడల్ ని తీసుకువస్తుండగా, దాని కంటే ముందుగా ఈ అప్ కమింగ్ ఎంపివి అధికారిక టీజర్ ని రిలీజ్ చేసింది. కార్‌మేకర్ విండ్‍సర్ ఈవీ అని పిలువబడుతున్న ఇండియా-స్పెక్ వెర్షన్ కారును రేపే ఆవిష్కరించనుంది.
దేశవ్యాప్తంగా వివిధ సందర్భాల్లో కొత్త విండ్‍సర్ ఈవీ టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఈ కొత్త ఎంజి విండ్‍సర్ ఈవీని వులింగ్ క్లౌడ్ ఈవీఅని కూడా పిలుస్తారు. ఈ కారు బివైడి e6ఎంపివివంటి వాటికి పోటీగా మారనుంది. ప్రస్తుతం ఈ మోడల్ విదేశాల్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మొదటి 50.6kWhయూనిట్ బ్యాటరీ ప్యాక్ 460 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుండగా, రెండవ 37.9kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ 360 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. ఈ రెండూ కూడా సింగిల్ ఫుల్ చార్జ్ పై పైన పేర్కొన్న డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తాయి.
ముందుగా కారు డిజైన్ గురించి చెప్పాలంటే, 2024విండ్‍సర్ ఈవీ కారు ఫ్రంట్ ప్రొఫైల్ లో మరియు రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ లైట్ బార్స్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్ డిజైన్, చంకీ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డోర్-మౌంటెడ్ ఓఆర్‌విఎం, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, స్క్వేర్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మరియు ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నాం.
ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే, ఎంపివి డ్యూయల్ స్క్రీన్ సెటప్ తో డామినేట్ చేసే విధంగా డ్యాష్‌బోర్డ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎడాస్ (ఏడీఏఎస్)సూట్, 360-డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు పవర్డ్ సీట్లతో వచ్చే అవకాశం ఉంది. పనోరమిక్ సన్ రూఫ్ మరియు టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లతో 2024విండ్‍సర్ ఈవీ వస్తున్నట్లు ఇదివరకే నిర్ధారించబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్