- ఎక్సైట్ వేరియంట్ కంటే తక్కువ ధరతో అందుబాటులోకి వచ్చిన ఎగ్జిక్యూటివ్ వేరియంట్
- 461 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ అందిస్తున్న మోడల్
ఎంజి మోటార్ ఇండియా 2024 రేంజ్ మోడల్స్ ధరలలో మార్పులు చేసి తన శతాబ్ది వేడుకలను ఘనంగా ఆరంభించింది. ఇప్పుడు ఈ ఆటోమేకర్ ZS ఈవీ యొక్క ఎంట్రీ-లెవల్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ని రూ. 18.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మోడల్ లో ఇంతకు ముందు లాంచ్ అయిన ఎంట్రీ-లెవల్ ఎక్సైట్ వేరియంట్ తో పోలిస్తే ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర 1 లక్ష రూపాయలు తక్కువగా ఉంది. ఓ రకంగా ఇది ఎంజి మోటార్ మోడల్స్ ని ఇష్టపడే కస్టమర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
మెకానికల్ గా, ఎంజి మోటార్స్ ZS ఈవీ ఎంట్రీ-లెవల్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ యొక్క పవర్ ట్రెయిన్ మరియు బ్యాటరీలో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే, 50.3kWh బ్యాటరీ ప్యాక్ సహాయంతో 173bhp పవర్ మరియు 280Nm టార్కును ఉత్పత్తి చేసే మోటారును ఇందులో కూడా కొనసాగిస్తుంది. దీని బ్యాటరీ ప్యాక్ ని 50kW డిసి ఫాస్ట్ ఛార్జర్ సహయంతో కేవలం 60 నిమిషాల్లోనే 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అదే విధంగా, దీని బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ రేంజ్ ని అందిస్తుంది.
ఇతర వార్తలలో చూస్తే, కార్ మేకర్ నుంచి కాంపాక్ట్ ఈవీగా అందించబడిన కామెట్ ఈవీ ధరలలో మార్పులు చేసింది. ఎంట్రీ-లెవెల్ పేస్ వేరియంట్ పై ఒక లక్ష రూపాయలు తగ్గగా, ప్లే మరియు ప్లస్ వేరియంట్స్ పై రూ.1.40 లక్షలు తగ్గింది. దీంతో, ఇది ఇప్పుడు మరింత చవకగా లభించనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్