- సెప్టెంబర్ 11న ఇండియాలో లాంచ్ కానున్న విండ్‍సర్
- ఎంజి నుంచి ఇండియాలో రానున్న మూడవ ఈవీ కారు
ఎంజి విండ్‍సర్ కి సంబంధించిన కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే, విండ్‍సర్ పనోరమిక్ సన్‌రూఫ్ తో లాంచ్ కానున్న విషయాన్ని ఆటోమేకర్ మరో సారి టీజర్ రిలీజ్ లో నిర్ధారించింది. అలాగే, ఎంజి నుండి రానున్న మూడోవఈవీ 11వ తేదీ సెప్టెంబర్ నెలలో లాంచ్ కావచ్చు. ఎంజి ఈ సన్ రూఫ్ ని 'ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్' అని పిలుస్తోంది మరియు ఎంజి దాని ఇతర మోడళ్లలో అందించిన సన్‌రూఫ్‌లను ఎలా పిలుస్తుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మోడల్ అందించబడనున్నసన్‌రూఫ్ ను ఎలక్ట్రికల్ గా ఆపరేట్ చేయవచ్చు. అలాగే, ఇది వివిధ భాషలలో వాయిస్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయగలిగే ఫీచర్ ను కలిగి ఉంటుంది.
టీజర్‌లో చూసిన విధంగా, ఎంజి రియర్ సీట్ ప్యాకేజీని విండ్‍సర్ లో కూడా అందిస్తుందని మాకు ఇప్పటికే తెలుసు మరియు సీట్‌బ్యాక్ 135-డిగ్రీల రిక్లైన్‌ను అందించే సెగ్మెంట్ లో ఈ ఫీచర్ మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వస్తుంది. అలాగే, ఇందులోని రియర్ సీట్స్ కోసం ఏసీ వెంట్స్ ఛార్జింగ్ పోర్ట్స్ మరియు యాంబియంట్ లైటింగ్ కూడా అందించవచ్చు.
విండ్‍సర్ ఇండియాలో ఎంజి మూడవ ఈవీ కాగా, కామెట్ మరియు ZS ఈవీ మధ్య ఆటోమేకర్ ఈ ఈవీ దానిలైనప్‌లో చేర్చబడింది, ఇందులో రెండోది (ZS ఈవీ) 2025లో అప్‌గ్రేడ్ చేయబడుతుందని భావిస్తున్నాం. అలాగే, ఎంజి దాని ఒకే రకమైన సెగ్మెంట్లలో ఈ స్ట్రాటజీని ఫాలో అవుతూ వివిధ మోడళ్లను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఎంజి పూర్తి లైనప్‌లో ఆస్టర్, ZS ఈవీ, హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ వంటి కార్లు ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప