- ఎంజి నుంచి ఇండియాలో అడుగుపెట్టిన మూడవ ఎలక్ట్రిక్ కారు
- అక్టోబర్ 3వ తేదీ నుంచి విండ్‍సర్ బుకింగ్స్ ప్రారంభం
ఇండియాలో మొట్టమొదటి ఫస్ట్ ఇంటెల్లిజెంట్ క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికిల్ (CUV)ని మనకు ఎక్స్‌క్లూజివ్ గా అందించింది. ఇండియాలో రూ.9.99 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారును ఎంజి మోటార్స్ లాంచ్ చేసింది. ఇది మొత్తంగా మూడు వేరియంట్లలో నాలుగు కలర్ ఆప్షన్లతో మరియు 38kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ పవర్ ట్రెయిన్ కాన్ఫిగరేషన్ తో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ అతి పెద్ద అప్ డేట్ ఏంటి అంటే, బ్యాటరీని రెంట్ కి కూడా తీసుకోవచ్చు. కిలోమీటర్ కి కేవలం రూ.3.50 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇంకా, ఎంజి మోటార్స్ బ్యాటరీని కూడా ఒక సర్వీసుగా (బిఎఎఎస్) అందిస్తుంది. ఎంజి నుంచి మూడవ ఎలక్ట్రిక్ కారుగా విండ్‍సర్అందించబడగా, ధర మరియు స్పెసిఫికేషన్ల పరంగా కామెట్ ఈవీ మరియు ZS ఈవీ మధ్య వచ్చింది.
ఎక్స్‌టీరియర్ హైలైట్స్
ముందుగా మనం ఈ కారు ఎక్స్‌టీరియర్ ప్రొఫైల్ నుంచి ప్రారంభిస్తే, విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారు సిగ్నేచర్ లుక్ మరియు హెడ్ ల్యాంప్స్ వంటి డిజైన్ అంశాలను పొందింది. కారు సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఈ కారు 18-ఇంచ్ క్రోమ్ అల్లాయ్ వీల్స్, ఫ్లోటింగ్ రూఫ్ లైన్, మరియు పాప్-అవుట్ డోర్ హ్యండిల్స్ ని పొందింది. కారు రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ మీరు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ మరియు గ్లాస్ హౌజ్ కింద క్రోమ్ గార్నిష్ వంటి వాటిని చూడవచ్చు. కారు కొలతల విషయానికి వస్తే, విండ్‍సర్ కారు 1,677ఎంఎం పొడవు, 1,850ఎంఎం వెడల్పు, మరియు 2,700 వీల్ బేస్ ని కలిగి ఉంది.
క్యాబిన్ హైలైట్స్
ఇంటీరియర్ పరంగా, విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారు లోపల అనువైన ప్యాటర్న్ సీట్లతో బ్లాక్ పై బీజ్ కలర్ కాంబినేషన్ ని ఎంజి కంపెనీ అందించింది. ఇందులో హైలైట్ ఫీచర్ ఏంటి అంటే, ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కోసం కామెట్ లో అందించిన ఒకే రకమైన ఆపరేటింగ్ సిస్టంతో కూడిన భారీ 15.6-ఇంచ్ డిస్ ప్లేని ఇందులో ఎంజి తీసుకువచ్చింది. దీనిని ఎంజి కంపెనీ ఎంజి గ్రాండ్ వ్యూ డిస్ ప్లేగా పేర్కొంది. ఇంకా రెండవ వరుస గురించి చెప్పాలంటే, ఇందులో 135-డిగ్రీలు వంపు తిరిగే సీట్లు ఈ కారుకు పెద్ద హైలైట్ అని చెప్పవచ్చు. ఇవి కారులో కూర్చున్న వారికి విమానంలోని బిజినెస్ క్లాస్ లో కూర్చున్న సీటింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఫీచర్లలో భాగంగా, ఇందులో మీరు యూఎస్‍బీ ఛార్జింగ్ పోర్ట్స్, రియర్ ఏసీ వెంట్స్, మరియు కప్ హోల్డర్లతో సెంటర్ ఆర్మ్ రెస్ట్ ని పొందుతారు. యాక్సెసరీస్ పరంగా, ఎంజి కంపెనీ ఇందులో సీట్ బ్యాక్ స్క్రీన్లను అందించింది.
ఫీచర్ లిస్టు
ఇక్కడ ఫోటోలలో చూసిన విధంగా, విండ్‍సర్ ఈవీలోని టాప్-స్పెక్ వేరియంట్ వైర్ లెస్ ఫోన్ మిర్రరింగ్, వైర్ లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, రియర్ ఏసీ వెంట్స్ తో క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, రిక్లైనింగ్ రియర్ సీట్, వివిధ భాషల్లో వాయిస్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే విధంగా పనోరమిక్ సన్ రూఫ్, జియో యాప్స్ మరియు కనెక్టివిటీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, మరియు ఫుల్ ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ వంటి ఫీచర్లను పొందింది.
బ్యాటరీ ప్యాక్ మరియు పవర్ ట్రెయిన్
ఎంజి విండ్‍సర్ ఈవీ కారు 38kWh యూనిట్ అనే ఒకేఒక్క బ్యాటరీ ప్యాక్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ బ్యాటరీ ప్యాక్ కారులోని ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి 134bhp పవర్ మరియు 200Nm టార్కును జనరేట్ చేస్తుంది. ఇంకా దీని డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే, 38kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ ని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ కారు సుమారు 331 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్నట్లు ఎంజి కంపెనీ పేర్కొంది. ఈ కారులో మీకు ఎకో, ఎకో+, నార్మల్ మరియు స్పోర్ట్ వంటి నాలుగు డ్రైవ్స్ మీకు లభిస్తాయి.
ఇండియాలో ఎంజి విండ్‍సర్ ఈవీ ఎక్స్-షోరూం ధరలు
ఎంజి విండ్‍సర్ ఎక్సైట్ – రూ.9.99 లక్షలు