- మూడు వేరియంట్లు, నాలుగు కలర్లలో లభ్యం
- 331 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్న 38kWh బ్యాటరీ ప్యాక్
గత నెలలో జెఎస్ డబ్ల్యూ ఎంజిమోటార్ ఇండియావిండ్‍సర్ఈవీ అనే ఎలక్ట్రిక్ కారును ఇండియాలో లాంచ్ చేసింది. కస్టమర్లు కొనుగోలు చేయడానికి ఈ కారు సిద్ధంగా ఉండగా, దీనిని ఒకేసారి రూ.13.5 లక్షల ఎక్స్-షోరూం ధరను చెల్లించి లేదా బ్యాటరీ రెంటల్ సర్వీసుతో కలిపి రూ.9.99 లక్షల ఎక్స్-షోరూం ధర చెల్లించి కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీని ఒక సర్వీసు (బ్యాటరీ యాజ్ ఏ సర్వీసు)గా అందిస్తున్న ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలు మా వెబ్ సైటులో వివరంగా అందించబడ్డాయి.
కార్ మేకర్ అక్టోబర్ 3వ తేదీన విండ్‍సర్ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ ప్రారంభించగా, ఇప్పటివరకు ఈ కారు 15,176 బుకింగ్స్ అందుకుంది. ఇక్కడ పేర్కొన్న బుకింగ్స్ అన్నీ కేవలం 24 గంటల్లోనే సాధించడం గమనార్హం. ఇంకా కారు డెలివరీ విషయానికి వస్తే, ఇదే నెల 12వ తేదీ నుంచి కార్ల డెలివరీ ప్రారంభమవుతుంది. అంటే, ఇప్పుడు బుక్ చేస్తే ఒక వారం వ్యవధిలోనే మీ ఇంటికి చేరుకుంటుంది అన్నమాట.
కొత్త విండ్‍సర్ ఈవీ కారు 38kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ తో అందించబడగా, ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడింది. అదే విధంగా దీని బ్యాటరీ ప్యాక్ ని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని ఎంజి కంపెనీ పేర్కొంది. పవర్ అవుట్ పుట్ విషయానికి వస్తే, ఈ మోడల్ 134bhp మరియు 200Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
ఎంజి మోటార్స్ 2024విండ్‍సర్ ఈవీ కారును ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్లలో అందించింది. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు ఈ కారు స్టార్ బర్స్ట్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్, మరియు టార్కాయిస్ గ్రీన్ అనే నాలుగు కలర్ల నుంచి మీకు నచ్చిన కలర్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్