- విండ్‍సర్ కి పోటీగా ఉన్న బివైడి e6 ఎంపివి
- త్వరలో ధరల ప్రకటన
కొత్త ఎంజి విండ్‍సర్ ఈవీ ఇండియాలో 2024 సెప్టెంబర్ 11వ తేదీన లాంచ్ కాబోతుంది. త్వరలో రాబోయే కారు ధరలను ఎంజి మోటార్ జెఎస్ డబ్లూ ఇండియా ప్రకటించనుంది. ఇక్కడ మేము ఇండియాలో బ్రాండ్ నుంచి అందించబడుతున్న మూడవ ఎలక్ట్రిక్ కారులో లభించే పూర్తి వివరాలను మీకు అందిస్తున్నాం. వాతీ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎక్స్‌టీరియర్ లుక్
విండ్‍సర్ గా పిలువబడుతున్న వులింగ్ క్లౌడ్ ఈవీ రీబ్యాడ్జ్డ్ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. గత కొన్ని రోజులుగా కార్ మేకర్ విండ్‍సర్ కి సంబంధించి కొన్ని టీజర్లను రిలీజ్ చేస్తూ, ఇందులో అందించే ఫీచర్లు మరియు ఎక్స్‌టీరియర్ డిజైన్ వివరాలకు సంబంధించి చిన్న చిన్న క్లూలను అందిస్తూ ఉంది. అప్పియరెన్స్ పరంగా, చూడడానికి విండ్‍సర్ ఈవీ ఒక ఎంపిపి షేప్ ని కలిగి ఉంది. ఇంకా ఇందులోని డిజైన్ హైలైట్లలో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తో నిలువుగా అమర్చినట్లు ఉండే హెడ్ ల్యాంప్ క్లస్టర్, కారు ముందు మరియు వెనుక భాగంలో విశాలమైన ఎల్ఈడీ బార్స్, మరియు లెఫ్ట్ ఫ్రంట్ ఫెండర్ పై ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ కారు దృడమైన అల్లాయ్ వీల్స్ తో వస్తుండగా, ఇది ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్ ని పొందుతుంది.
ఇంటీరియర్
ఎంజి కంపెనీ విండ్‍సర్ ఈవీని కొత్త సీయూవీగా పిలుస్తుండగా, దీని లోపల చాలా విశాలంగా ఉంటుంది. కొత్త విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారు టూ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, బ్లాక్ అప్హోల్స్టరీ, యాంబియంట్ లైటింగ్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో అందించే 135-డిగ్రీ రిక్లైన్ ఫంక్షన్‌తో రియర్ సీట్లు (ఏరో-లాంజ్ సీట్లు) ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
పవర్ ట్రెయిన్
ప్రపంచవ్యాప్తంగా, ఎంజి విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో రాగా, ఇది రెండు బ్యాటరీ ప్యాక్ లతో అందించబడుతుంది. సింగిల్ ఛార్జ్ పై 50.6kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ 460 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందించనుండగా, 37.9kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ 360 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందించనుంది. ఇంకో విషయం ఏంటి అంటే, ఇండియాలో లాంచ్ అయ్యే కారులో ఎలాంటి స్పెసిఫికేషన్లను ఎంజి కంపెనీ అందిస్తుందో ఇప్పటివరకు పేర్కొనలేదు.
లాంచ్ టైంలైన్ మరియు కాంపిటీషన్
ఇండియాలో సెప్టెంబర్ 11వ తేదీన విండ్‍సర్ ఈవీని లాంచ్ చేయాలని ఎంజి కంపెనీ ప్లాన్ చేస్తుంది. లాంచ్ అయిన తర్వాత, ఈ ఎలక్ట్రిక్ కారు వివైడి e6 కారుతో పోటీపడుతుంది. ఎందుకంటే, ఈ ఎలక్ట్రిక్ కారు బాడీ స్టైల్ కూడా అచ్చం విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారులాగే ఉంటుంది.
గమనిక: పైన అందించబడినవి వులింగ్ క్లౌడ్ ఈవీ ఫోటోలు (ఇది ఎంజి విండ్‍సర్ ఆధారంగా వచ్చింది)
అనువాదించిన వారు: సంజయ్ కుమార్