- రూ. 13.5 లక్షలతో కారు కొనుగోలు ధర ప్రారంభం
- అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న బుకింగ్స్
వేరియంట్ వారీగాజెఎస్ డబ్లూ ఎంజి మోటార్ ఇండియా, విండ్‍సర్ ఈవీ ధరలను ప్రకటించింది. వీటి ధరలు రూ. 13.5 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, పైన పేర్కొన్న ధర BaaS (బ్యాటరీగా సేవ) ప్రోగ్రామ్ కింద వర్తించవు. ఈ ధర కారును పూర్తిగా కొనుగోలు చేయడానికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే, ఈ మోడల్ బుకింగ్‌లు అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.
ఎంజి విండ్‍సర్ ఈవీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ధరల విషయానికొస్తే, ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 13.5 లక్షలు, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ధర రూ. 14.5 లక్షలు, మరియు ఎసెన్స్ వేరియంట్ ధర రూ. 15.5 లక్షలు, (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే, కస్టమర్‌లు ఈ మోడల్ ను స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్ మరియు టర్కోయిస్ గ్రీన్ అనే 4 పెయింట్స్ రేంజ్ నుండి ఎంచుకోవచ్చు.
కీలక అంశాలలో కొత్త విండ్‍సర్ ఈవీమూడు సంవత్సరాల తర్వాత 60 శాతం బైబ్యాక్ విలువ లేదా 45,000 కిలోమీటర్ల వరకు ఉండగా, ఎంజి యాప్ ద్వారా eHubని ఉపయోగించి పబ్లిక్ ఛార్జర్‌లలో మొదటి సంవత్సరం వరకు ఉచిత ఛార్జింగ్ మరియు కారు మొదటి యజమానికి లైఫ్ టైం బ్యాటరీ వారంటీని పొందవచ్చు.
ఎంజి విండ్‍సర్ ఈవీ 134bhp మరియు 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి 38kWh బ్యాటరీ ప్యాక్ తో అందిచనాడుతుంది. ఈ కారు ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ 332కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. అదనంగా, ఇందులో ఎకో, ఎకో+, నార్మల్ మరియు స్పోర్ట్ అనే 4 డ్రైవ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, లేటెస్టుగా లాంచ్ అయిన 2024 ఎంజి విండ్‍సర్ ఈవీ కారును మేము డ్రైవ్ చేశాము, దీనికి సంబంధించిన రివ్యూ కూడా కార్ వాలే వెబ్ సైటులో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప