- క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికిల్ గా పిలుస్తున్న ఎంజి
- పనోరమిక్ సన్ రూఫ్, భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మరియు మరెన్నో ఫీచర్లను పొందనున్న విండ్‍సర్
ఎంజి మోటార్ ఇండియా దాని ఆల్-ఎలక్ట్రిక్ ఎంపివి విండ్‍సర్ ఈవీని సెప్టెంబర్ 11వ తేదీన దేశవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. ఇప్పుడు, లాంచ్ కి ముందుగా, దేశవ్యాప్తంగా ఉన్న సెలెక్టెడ్ డీలర్స్ విండ్‍సర్ ఎలక్ట్రిక్ కార్ల ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించారు.
ఇండియాలో లాంచ్ కాబోతున్న విండ్‍సర్ ఈవీ కారు వులింగ్ క్లౌడ్ ఈవీకి రీబ్యాడ్జ్డ్ వెర్షన్. డిజైన్ పరంగా ఈ కారు ఎంపివి లుక్ ని పోలి ఉండగా కొంతవరకు సిల్హౌట్ హ్యచ్ బ్యాక్ వలె ఉంటుంది. అయితే, ఆటోమేకర్ ఈ కారును సీయూవీగా పిలుస్తుంది. అంటే, క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికిల్ అని అర్థం. ఈ ఎలక్ట్రిక్ కారు ముందు మరియు వెనుక భాగాలలో పూర్తి (ఫుల్-విడ్త్) లైట్ బార్ ని పొందుతుంది. ఇతర డిజైన్ అంశాలలో నిలువుగా అమర్చినట్లు ఉండే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్-ఫెండర్ మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్, అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, మరియు ఫ్లష్-ఫిట్టింగ్ హ్యండిల్స్ వంటివి ఉన్నాయి.
క్యాబిన్ లోపల చూస్తే, విండ్‍సర్ ఈవీ వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో సెగ్మెంట్ ఫస్ట్ 15.6-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్, రిక్లైనింగ్ ఫంక్షన్ తో ఎయిర్ లైన్-టైప్ రియర్ సీట్స్, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటి బెస్ట్ ఫీచర్లతో రానుంది. ఇందులో కొత్తగా ఏమున్నాయి అంటే, కొత్త విండ్‍సర్ ఈవీ సెగ్మెంట్-లీడింగ్ గా చెప్పుకునే 15.6-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంని ఎంజి గ్రాండ్ వ్యూ డిస్ ప్లేగా పిలుస్తుంది. అలాగే, గత వారం రిలీజ్ అయిన టీజర్ ని పరిశీలిస్తే, అందులో పనోరమిక్ సన్ రూఫ్ ని ఎంజి కంపెనీ ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్ అని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా, విండ్‍సర్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అందులో 37.9kWh యూనిట్ మరియు 506kWh యూనిట్ ఉన్నాయి. సింగిల్ ఛార్జ్ పై ఈ బ్యాటరీ ప్యాక్స్ 460 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తాయి. లాంచ్ తర్వాత, ఎలక్ట్రిక్ ఎంపివి సెగ్మెంట్లో విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారు బివైడి e6 కారుతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్