- బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో జతచేరనున్న మూడవ ఈవీ
- వులింగ్ క్లౌడ్ ఈవీ ఆధారంగా వస్తున్న విండ్‍సర్ ఈవీ
ఎంజి మోటార్ ఇండియా రేపు, అనగా సెప్టెంబర్ 11వ తేదీ న విండ్‍సర్ ఈవీని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడంతో పాటుగా దాని ధరలను కూడా ప్రకటించనుంది. ఈ కొత్త ఆల్-ఎలక్ట్రిక్ వెహికల్ చైనాలో విక్రయించబడుతున్న వులింగ్ క్లౌడ్ ఈవీ ఆధారంగా వస్తుంది. దీంతో, ఇప్పుడు ఎంజి ఇండియా దాని ఈవీ పోర్ట్‌ఫోలియోలో ZS ఈవీ, కామెట్ ఈవీ మరియు విండ్‍సర్ ఈవీలతో మూడు మోడళ్లను కలిగి ఉంది.
విండ్‍సర్ ఈవీ 'CUV' అనే ట్యాగ్ జోడించబడి అసాధారణమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ముందు మరియు వెనుక వైపున పూర్తి-వెడల్పైన లైట్ బార్, చంకీ 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, నిలువుగా అమర్చిన హెడ్‌ల్యాంప్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ మరియు చిన్న బానెట్‌తో కూడిన భారీ రేక్డ్ విండ్‌స్క్రీన్ వంటి కొన్ని ఎక్స్‌టీరియర్ హైలైట్స్ సెటప్‌తో కొత్త లుక్ ను పొందుతుంది.
ఫీచర్ల పరంగా చెప్పాలంటే, విండ్‍సర్ ఈవీ వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన పెద్ద 15.6-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీల సరౌండ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఎయిర్‌లైన్- థీమ్డ్ రియర్ సీట్స్ తో రిక్లైన్ ఫంక్షన్ వంటి ఫీచర్లతో వస్తుంది. కాకపోతే, ఈవీ లో ఏడీఏఎస్(ఎడాస్)ఫీచర్లు లేవని పుకార్లు వినిపిస్తుండగా, ఇది నిజమా ? కాదా ? అనే విషయం రేపు దీని లాంచ్ సమయంలో వెల్లడవుతుంది.
ఆటోమేకర్ విండ్‍సర్ ఈవీ బ్యాటరీ ప్యాక్, రేంజ్ మరియు స్పెసిఫికేషన్‌ల గురించి ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు, అంతర్జాతీయంగా, వులింగ్ క్లౌడ్ ఈవీ వెర్షన్ 37.9kWh మరియు 50.6kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే, ఈ మోడల్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే (సింగిల్ ఛార్జ్) మాక్సిమం 460 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. దీని గురించి ఇంకా చెప్పాలంటే, ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించే బ్యాటరీ ప్యాక్ ని ఇండియా-స్పెక్ వెర్షన్ కారు పొందుతుందని మేము భావిస్తున్నాం.
అనువాదించిన వారు: రాజపుష్ప