- బివైడి e6 ఎంపివితో సీయూవీ పోటీపడే అవకాశం
- ఇండియాలో ఎంజి నుంచి వస్తున్న మూడవ ఎలక్ట్రిక్ కారు
ఇండియాలో కొత్త విండ్‍సర్ ఈవీ ధరలను సెప్టెంబరు 11వ తేదీన ప్రకటిస్తున్నట్లు ఎంజి మోటార్ జెఎస్‍డబ్లూ ఇండియా నిర్దారించింది. వులింగ్ క్లౌడ్ ఈవీ రీబ్యాడ్జ్ వెర్షన్ గా పాపులారిటీ పొందిన ఈ ఎలక్ట్రిక్ కారు, ఇండియన్ మార్కెట్లో ఎంజి మోటార్స్ నుంచి వస్తున్న మూడవ ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.
2024విండ్‍సర్ ఈవీ గత టీజర్లను గమనిస్తే, వాటిలో చాలా ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌టీరియర్ హైలైట్లలో ఫ్రంట్ మరియు రియర్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తో నిలువుగా అమర్చినట్లు ఉండే హెడ్ ల్యాంప్ క్లస్టర్, ఎడమ భాగంలో ఫ్రంట్ ఫెండర్ పై ఛార్జింగ్ పోర్ట్, చంకీ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, మరియు ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ఇంటీరియర్ పరంగా, విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారు లోపల టూ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, 135-డిగ్రీల రిక్లైన్ ఫంక్షన్ ఏరో-లాంజ్ సీట్లుగా రియర్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ మరియు బ్లాక్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్లను ఎంజి మోటార్స్ అందించనుంది.
ప్రపంచవ్యాప్తంగా, ఎంజి విండ్‍సర్ ఈవీ 50.6kWh యూనిట్ మరియు 37.9kWh యూనిట్ల బ్యాటరీ ప్యాక్స్ ఒక్కోటి సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి అందించబడతాయి. పైన పేర్కొన్న ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, వరుసగా 460 కిలోమీటర్లుమరియు 360 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తాయి. ఇండియా-స్పెక్ కారులో కూడా ఇవే స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. లాంచ్ అయిన తర్వాత, విండ్‍సర్ ఈవీ బివైడి e6 ఎంపివితో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్