- వచ్చే నెలలో ఇండియాలో విండ్‍సర్ ఈవీ లాంచ్
- ఎంజి-జెఎస్‍డబ్లూ నుంచి సంయుక్తంగా వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ కారు
సెప్టెంబర్ 11వ తేదీన ఎంజి విండ్‍సర్ ఈవీ లాంచ్ కానుంది. అంతకు ముందుగా ఎంజి కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి మరో టీజర్ ని రిలీజ్ చేసింది. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ ద్వారా విండ్‍సర్ ఈవీ పనోరమిక్ సన్ రూఫ్ తో వస్తున్నట్లుగా నిర్ధారణ కాగా, నేడు రిలీజ్ అయిన కొత్త టీజర్ ద్వారా ఇది భారీ టచ్ స్క్రీన్ సిస్టంతో వస్తున్నట్లు నిర్దారణ అయ్యింది. ఈ కొత్త విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారుకు ఎంజి మోటార్స్ సీయూవీగా పేరు కూడా పెట్టింది. అంటే, క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికిల్ అని అర్థం.
కొత్త విండ్‍సర్ ఈవీ సెగ్మెంట్-లీడింగ్ గా చెప్పుకునే 15.6-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంని పొందుతుంది. దీనినే ఎంజి గ్రాండ్ వ్యూ డిస్ ప్లేగా పిలుస్తుండగా, ఇది సెగ్మెంట్లో ఉన్న భారీ స్క్రీన్ తో మాత్రమే కాకుండా ప్రస్తుతం ఇండియాలో విక్రయించబడుతున్న ఎంజి కార్ల కంటే ఎక్కువ స్క్రీన్ సైజుతో వస్తుంది.
ఎంజి విండ్‍సర్ టీజర్ వీడియోలో వెల్లడైన అదనపు కీలక ఫీచర్లలో 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టూ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్డ్ టెయిల్‌గేట్, క్రూయిజ్ కంట్రోల్ మరియు డ్యాష్‌బోర్డ్ అంతటా ఫాక్స్ వుడ్ ఇన్సర్ట్స్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది పనోరమిక్ సన్ రూఫ్ మరియు రియర్ సీట్ ప్యాకేజీతో అందించబడుతుంది. గత వారం రిలీజ్ అయిన టీజర్ ని పరిశీలిస్తే, అందులో పనోరమిక్ సన్ రూఫ్ ని ఎంజి కంపెనీ ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్ అని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా, రాబోయే (అప్ కమింగ్) బివైడి e6తో పోటీపడుతున్న విండ్‍సర్ ఈవీ 37.9kWh యూనిట్ మరియు 50.6kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందించబడుతుండగా, ఈ బ్యాటరీ ప్యాక్స్ ఒక్కోటి సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి రానున్నాయి. ఇంకా, దీని డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే, సింగిల్ ఫుల్ ఛార్జ్ పై, మొదటి బ్యాటరీ ప్యాక్ 360 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందించనుండగా, రెండవ బ్యాటరీ ప్యాక్ 460 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందించనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్