- ఇటీవలే జెఎస్‌డబ్ల్యూతో తన ఫ్యూచర్ ప్లాన్స్ వెల్లడించిన ఎంజి
- ఈ ఏడాది చివర్లో లాంచ్ కానున్న రెండు కొత్త మోడల్స్
నవంబర్ 2023లో, ఎంజి మోటార్ ఇండియా జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌పై సిగ్నేచర్ చేసింది. ప్రస్తుతం ఎంజి ఇండియన్ ఆపరేషన్లలో 35 శాతం వృద్ధిని కలిగి ఉంది, అయితే ఎంజి కంపెనీ, ఎస్ఏఐసీ, జాయింట్ వెంచర్‌కు కూడా మద్దతును అందిస్తుంది.
ఎంజి మరియు జెఎస్‌డబ్ల్యూ ఇటీవల విలేకరుల సమావేశాన్ని నిర్వహించి, ఇండియన్ మార్కెట్లోకి తమ ఫ్యూచర్ ప్లాన్స్ ను ప్రకటించారు. ఈ బ్రాండ్‌కు జెఎస్‌డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా అనే కొత్త పేరును కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంజి ఉత్పత్తిని అభివృద్ధి చేసే ప్లాన్స్ ను వెల్లడించింది.
ప్రస్తుత జెఎస్‌డబ్ల్యూ ఎంజి యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ సంవత్సరానికి మూడు లక్షల యూనిట్లుగా ఉంది, ఇది ఏటా మూడు లక్షల యూనిట్ల వరకు పెరుగుతుంది. ఆటోమేకర్ ప్రస్తుతం కామెట్ ఈవీ, ఆస్టర్, హెక్టర్, ZS ఈవీ మరియు గ్లోస్టర్‌లతో సహా తన అన్ని వెహికిల్స్ ని ఇండియాలోని ఏకైక ప్లాంట్ గుజరాత్‌లోని హలోల్‌లో తయారు చేస్తోంది.
ఇంకా, జెఎస్‌డబ్ల్యూ ఎంజి ప్రతి 3-6 నెలలకు కొత్త కార్లను పరిచయం చేస్తామని పేర్కొంది , ఈ సంవత్సరం తర్వాత పండుగ సీజన్‌లో కొత్త ఎనర్జీ వెహికల్స్ (ఎన్ఈవీస్)పై ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఈ సంవత్సరం చివరి నాటికి, ఇది రెండు కొత్త కార్లను లాంచ్ చేయనుంది, అలాగే, వీటి వివరాలు మరికొన్ని నెలల్లో వెలువడే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప