- ఇటీవల కామెట్ ఈవీ, హెక్టర్ మరియు ZS ఈవీ అప్‌డేట్‌లను లాంచ్ చేసిన ఎంజి
- 18శాతం నెలవారీ వృద్ధిని నమోదు చేసిన ఎంజి
ఎంజి మోటార్ ఇండియా ఫిబ్రవరి 2024లో మొత్తం 4,532 యూనిట్లను విక్రయించింది.కార్‌మేకర్ మునుపటి నెలలో (జనవరి 2024) 3,825 యూనిట్లను విక్రయించింది, తద్వారా 18 శాతం నెలవారీ వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా, గత నెలలో మొత్తం అమ్మకాలలో కేవలం ఈవీలు మాత్రమే దాదాపు 33 శాతం వరకు ఉన్నాయి.
ప్రస్తుతం, వివిధ అంతర్జాతీయ ఈవెంట్‌లలోని గ్లోబల్ షిప్పింగ్‌లో ఎదురవుతున్న లాజిస్టిక్స్ సమస్యలపై పని చేయడానికి సిద్ధమవుతోందని ఎంజి తెలిపింది. అదే సమయంలో, ఈ బ్రాండ్ రాబోయే నెలల్లో ఫేస్‌లిఫ్టెడ్ గ్లోస్టర్‌ను లాంచ్ చేయాలని కూడా భావిస్తుంది.
ఈ నెల ప్రారంభంలో, ఎంజి ZS ఈవీ మరియు కామెట్ ఈవీ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌లను పరిచయం చేసింది. మొదటి దాంట్లో రెండు కొత్త వేరియంట్‌లను అందిస్తుండగా, కామెట్ ఈవీలో వేరియంట్ పేర్ల మార్పులు, కొత్త ఫీచర్లు మరియు ఆప్షనల్ ఫాస్ట్ ఛార్జర్ తో సహా అనేక మార్పులను చేసింది.హెక్టర్ కొత్తగా అదనపు వేరియంట్‌లను పొందగా, దానితో పాటు బేస్ వేరియంట్ పై భారీగా ధర తగ్గింది, వాటి వివరాలు మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప