- గత నెలలో 17 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిన ఎంజి
- దాదాపుగా 25 శాతం విక్రయాలతో ఈవీల సహకారం
అక్టోబర్ 2023లో దేశీయ మార్కెట్ మొత్తంలో 5,108 యూనిట్లను విక్రయించినట్లు ఎంజి మోటార్ ఇండియా వెల్లడించింది. ఈ అంకెలను గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం వరకు పెరిగాయి.
అదే సమయంలో, ఎంజి బ్రాండ్ మొత్తం అమ్మకాలలో సుమారుగా 25 శాతం వరకు ఈవీల సహకారం ఉన్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివిధ మోడల్స్ పై ఆఫర్లు కస్టమర్లను ఆకర్షించడానికి, అదే విధంగా సెంటినరీ మరియు పండుగ సేల్స్ ను ప్రోత్సాహించేలా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
గత వారంలో, సెలెక్ట్ చేసిన ఎంజి మోడళ్ల ధర పెరుగుదల వివరాలు మేము పొందాము, ఇవి 1 నవంబర్ నుండి అమలులోకి రానున్నాయి. ఈ మోడల్లలో హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ కూడా ఉన్నాయి, వీటి ధరలు అమాంతం రూ.40,000 వరకు పెరగనున్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప