- బేస్ వేరియంట్ కంటే కొద్దిగా ఎక్కువ ఫీచర్లతో వచ్చిన కొత్త వేరియంట్
- ఇప్పుడు నాలుగు వేరియంట్లతో అందుబాటులో ఉన్న ZS ఈవీ
ఎంజి ZS ఈవీ వేరియంట్లు మరియు ధరలు
ఎంజి మోటార్ ఇండియా ZS ఈవీ మోడల్ లో ఎక్సైట్ ప్రో అనే కొత్త వేరియంట్ ని లాంచ్ చేసింది. దీని ధర రూ.19.98 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండగా, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వేరియంట్ రూ.18.98 లక్షలు (ఎక్స్-షోరూం) ధరతో బేస్ వేరియంట్ గా కొనసాగుతుంది. టాప్-స్పెక్ ఎస్సెన్స్ మరియు ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 24.98 లక్షలు మరియు రూ.23.98 లక్షలుగా (రెండు ధరలు, ఎక్స్-షోరూం) ఉన్నాయి.
ఎంజి ZS ఈవీ | ఎగ్జిక్యూటివ్ | ఎక్సైట్ ప్రో | ఎక్స్‌క్లూజివ్ ప్లస్ | ఎస్సెన్స్ | |
రూ.18,98,000 | రూ.19,98,000 | రూ. 23,98,000 | రూ. 24,98,000 |
ఎంజి ZS ఈవీ ఫీచర్స్
ఎంజి ZS ఈవీ ఎక్సైట్ ప్రో రూ.20 లక్షలలోపు డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్ రూఫ్ తో ఇండియాలో మాత్రమే అందించబడుతున్న ఒకే ఒక్క ఈవీగా నిలిచింది. ఇది 75కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో మరియు లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్) సూట్ ని కూడా పొందిన ఈవీగా కొనసాగుతుంది. ఒకవేళ కారు ఓనర్ తో ఫిజికల్ కీ లేకపోతే కారును డిజిటల్ కీతో స్టార్ట్ చేసే డిజిటల్ కీ ఫీచర్ ని మొట్టమొదటగా ఈ సెగ్మెంట్లో ఎంజి మోటార్స్ తీసుకువచ్చింది.
ఎంజి ZS ఈవీ బ్యాటరీ ప్యాక్ మరియు రేంజ్
ZS ఈవీ మిడ్-సైజ్ 5-సీటర్ వెహికిల్ 50.3kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చింది. ZS ఈవీలో ఉపయోగించిన ప్రిస్మాటిక్ సెల్ IP69K రేటెడ్, ఎఎస్ఐఎల్-డి, మరియు UL2580 బ్యాటరీ 461 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ మైలేజీని అందిస్తుంది. టెస్ట్ డ్రైవ్ లో భాగంగా మేము దీనిని ఒకసారి ఫుల్ చార్జ్ చేసి డ్రైవ్ చేయగా 340 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్