- హై వేరియంట్స్ పై భారీగా తగ్గనున్న ధరలు
- అమలులోకి రానున్న సవరించిన హెక్టర్ ఎస్‌యూవీ ధరలు
ఎంజి మోటార్ ఇండియా హెక్టర్ ప్లస్ ఎస్‍యువి ధరలను సవరించింది. కాగా బేస్ వేరియంట్స్ ధరలు రూ. 50,000 వరకు, హై వేరియంట్స్ పై రూ.1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ధరలు భారీగా తగ్గాయి.
హెక్టర్ ప్లస్ పెట్రోల్ కొత్త ధరలు
హెక్టర్ ప్లస్ పెట్రోల్ వేరియంట్స్ లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 141bhp మరియు 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. అదే విధంగా మోటారు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు సివిటి యూనిట్‌తో జత చేయబడింది. డిసిటి గేర్‌బాక్స్ ఫేస్‌లిఫ్టెడ్ హెక్టర్ ప్లస్‌లో నిలిపివేయబడింది.
వేరియంట్స్ | ధరలో మార్పు |
స్మార్ట్ | రూ.50,000 వరకు తగ్గింపు |
షార్ప్ ప్రో మరియు సావీ ప్రో | రూ.66,000 నుంచి రూ.81, 000 వరకు తగ్గింపు |
హెక్టర్ ప్లస్ డీజిల్ కొత్త ధరలు
హెక్టర్ ప్లస్ డీజిల్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 168bhp మరియు 350Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి, అదే విధంగా ఎలాంటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లేకుండా వస్తుంది.
వేరియంట్స్ | |
స్మార్ట్ (7-సీటర్) | రూ.1.04 లక్షలు ధర తగ్గింపు |
స్మార్ట్ ప్రో (6-సీటర్) | రూ.1.2 లక్షలు ధర తగ్గింపు |
షార్ప్ ప్రో (6 మరియు 7-సీటర్) | రూ.1.22 లక్షలు నుంచి రూ.1.37 లక్షలు వరకు ధర తగ్గింపు |
ఎంజి హెక్టర్ ధరల మార్పు
ఈ నెల ప్రారంభంలో, ఎంజి ప్లస్ 5- సీటర్ వెర్షన్ హెక్టర్ ఎస్‌యూవీ ధరలలో కూడా మార్పులు చేసింది. హెక్టర్‌ను 7 వేరియంట్స్ లో పొందవచ్చు. అలాగే,సెలెక్ట్ చేసిన వేరియంట్‌లపై ధరలు తగ్గించబడ్డాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్