- ఎలాంటి మార్పు లేని బేస్ వేరియంట్స్ ధరలు
- డీజిల్ వేరియంట్స్ పై అధికంగా పెరిగిన ధరలు
ఎంజి మోటార్ ఇండియా హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ ధరలను పెంచింది. బేస్ వేరియంట్‌లపై ధరలను మార్చకుండా, హయ్యర్ ట్రిమ్స్ ఎక్స్-షోరూమ్ ధరలపై రూ. 61,000 వరకు ధరలను పెంచింది.
హెక్టర్ ప్లస్ పెట్రోల్ కొత్త ధరలు
హెక్టర్ ప్లస్ పెట్రోల్ వేరియంట్స్ లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 141bhp మరియు 250Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసేలాగా ట్యూన్ చేయబడింది. అంతేకాకుండా దీని మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, సివిటి యూనిట్‌తో మరియు ఫేస్‌లిఫ్టెడ్ హెక్టర్ ప్లస్ డిసిటి గేర్‌బాక్స్ తో జత చేయబడింది.
వేరియంట్స్ | ధరల మార్పు |
షార్ప్ ప్రో, సావీ ప్రో, | ధర రూ. 30,000 |
స్మార్ట్ మరియు స్మార్ట్ EX | ధరలో ఎలాంటి మార్పు లేదు |
హెక్టర్ ప్లస్ డీజిల్ కొత్త ధరలు
హెక్టర్ ప్లస్ డీజిల్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 168bhp మరియు 350Nm మాక్సిమమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి మరియు ఎలాంటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లేకుండా వస్తుంది.
వేరియంట్స్ | ధరల మార్పు |
స్మార్ట్ (7-సీటర్) | ధర రూ. 28,000 |
స్మార్ట్ ప్రో (6-సీటర్) | ధర రూ. 59,000 |
షార్ప్ ప్రో (6 మరియు 7-సీటర్) | ధర రూ. 61,000 |
ఎంజి హెక్టర్ ధరల మార్పు
ఈ నెల ప్రారంభంలో, ఎంజి ప్లస్ 5- సీటర్ వెర్షన్ హెక్టర్ ఎస్‌యూవీ ధరలు కూడా పెరిగాయి. హెక్టర్‌ను 7 వేరియంట్‌లలో పొందవచ్చు మరియు సెలెక్ట్ చేసిన వేరియంట్‌లపై ధరలు తగ్గించబడ్డాయి.
అనువాదించిన వారు:రాజపుష్ప