- కొత్తగా షైన్ ప్రో మరియు సెలెక్ట్ ప్రో అనే రెండు వేరియంట్లను పరిచయం చేసిన ఎంజి
- అప్‍డేటెడ్ ఫీచర్లను పొందిన కొత్త వేరియంట్లు
ఎంజి మోటార్ ఇండియా హెక్టర్ ఎస్‍యూవీ యొక్క వేరియంట్ లిస్టును రెండు కొత్త కొత్త వేరియంట్లతో అప్‍డేట్ చేసింది. కొత్తగా వచ్చిన ఈ రెండూ షైన్ ప్రో మరియు సెలెక్ట్ ప్రో వేరియంట్ల ధరలు వరుసగా రూ.16 లక్షలు మరియు రూ.17.30 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూం)గా ఉన్నాయి. దీంతో, ఇప్పుడు హెక్టర్ ధర రూ.16 లక్షలతో ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూం).
హెక్టర్ యొక్క ఈ రెండు కొత్త వేరియంట్లు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్‌తో కూడిన పెద్ద 14-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని కలిగి ఉన్నాయి. అలాగే షైన్ ప్రో వేరియంట్ సింగిల్-పేన్ సన్ రూఫ్ ని పొందగా, సెలెక్ట్ ప్రో వేరియంట్ డ్యూయల్-టోన్ పనోరమిక్ సన్ రూఫ్ ని పొందింది. ఇంకా ఇతర హైలైట్ ఫీచర్లలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ మరియు డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ ఫినిషింగ్ ఉన్నాయి.
మెకానికల్ గా, ఎంజి హెక్టర్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో వచ్చింది. ఇక ఈ రెండు ఇంజిన్లకు 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సు స్టాండర్డ్ గా రాగా, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మాత్రం కేవలం పెట్రోల్ మోటారుకు మాత్రమే పరిమితం చేయబడింది.
లాంచ్ గురించి ఎంజి మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ “ 2019లో ఇది లాంచ్ అయినప్పటి నుండి ఎంజి హెక్టర్ దాని అసాధారణమైన పెర్ఫార్మెన్స్ మరియు పెద్ద మొత్తంలో టెక్ ఫీచర్లతో ఏడీఏఎస్(అడాస్) లెవెల్-2 మరియు కనెక్టెడ్ ఫీచర్లతో సుపీరియర్ డ్రైవింగ్ కంఫర్ట్ తో బోల్డ్ స్టేట్మెంట్ ని అందించింది. ప్రతి వేరియంట్ దాని సెగ్మెంట్లో కంఫర్ట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మరియు అద్బుతమైన డిజైన్ తో ఒక కొత్త బెంచ్ మార్కును సెట్ చేసింది. మార్కెట్ రీసెర్చ్, ఇండస్ట్రీ అనాలిసిస్, మరియు కస్టమర్ ఫీడ్ బ్యాక్ లకు అనుగుణంగా ఈ రెండు కొత్త వేరియంట్లను పరిచయం చేశాము, ఎస్‍యూవీలను అమితంగా ఇష్టపడే కస్టమర్లకు పెర్ఫార్మెన్స్ మరియు ఎలివేటెడ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడంలో మా నిబద్ధతను చాటుకుంటున్నాము” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్