- రూ.21.25 లక్షల ప్రారంభ ధరతో లభ్యం
- 5, 6, 7-సీటర్ ఆప్షన్లతో అందించబడుతున్న హెక్టర్ బ్లాక్ స్టార్మ్
ఎంజి మోటార్ ఇండియా తాజాగా హెక్టర్ రేంజ్‌లోకి ‘బ్లాక్‌స్టార్మ్’ అనే డార్క్ ఎడిషన్ వెర్షన్‌ను తీసుకువచ్చింది. ఇది 5, 6 మరియు 7 సీటర్ ఆప్షన్లలో రూ. 21.25 లక్షల ఎక్స్- షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ప్రారంభ ధరతో ఎంజి కంపెనీ దీనిని తీసుకురాగా, మొదటి 250 యూనిట్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. ఇప్పుడు, లాంచ్ తర్వాత, హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం కూడా ప్రారంభమైంది.
బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ మొదటిసారిగా ఫ్లాగ్‌షిప్ గ్లోస్టర్ ఎస్‌యూవీలో తరువాత ఆస్టర్ లో కనిపించింది.ఈ కొత్త ఎడిషన్ హెక్టర్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ విభాగాల్లో కారుకు మరిన్ని సొగసులను అందిస్తూ ది బెస్ట్ గా డిజైన్ చేయబడింది. మొదటగా చెప్పాలంటే, ఇది బంపర్స్, ఓఆర్‌విఎం మరియు బ్రేక్ కాలిపర్‌లపై రెడ్ యాక్సెంట్స్ తో పూర్తి బ్లాక్ పెయింట్ ఫినిషింగ్ ని పొందింది.ఇంకా చెప్పాలంటే, ఇది డార్క్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ హెడ్‌ల్యాంప్ బెజెల్స్, బ్లేడ్ ఫినిష్‌తో స్మోక్డ్ టెయిల్ లైట్స్ మరియు ‘బ్లాక్‌స్టార్మ్’ బ్యాడ్జ్‌లను కూడా కలిగి ఉంది.
కారు క్యాబిన్ లోపల చూస్తే, ఈ ఎస్‌యూవీ రెడ్ యాక్సెంట్స్ మరియు యాంబియంట్ లైటింగ్‌ని హైలైట్ చేసే విధంగా బ్లాక్-అవుట్ థీమ్ ని కలిగి ఉంది. ఫీచర్ల విషయానికొస్తే, హెక్టర్ లో పెద్ద పోర్ట్రెయిట్-స్టైల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే మరియు లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్) సూట్ ని అందించింది.
మెకానికల్ గా, హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చింది. మొదటి ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి 141bhp మరియు 250Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. రెండవ ఇంజిన్ గా చెప్పబడుతున్న డీజిల్ మిల్ 6-స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే జతచేయబడి 168bhp మరియు 350Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్