- 6 వేరియంట్లలో లభ్యం
- అందుబాటులో ఉన్నపెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్స్
ఎంజి మోటార్ ఇండియా భారతదేశంలో తన హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ఎస్‌యువి ధరలను మరోసారి పెంచింది. సెప్టెంబర్‌లో హెక్టర్ ధరలను తగ్గించిన తర్వాత, ఆటోమేకర్ ఈ నెలలో ఎస్‌యువి ధరను రూ. 40,000వరకు పెంచింది. దీనితో, ఎంజి హెక్టర్ ప్లస్ ను ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో మరియు ఎంజి హెక్టర్ ను ప్రారంభ ధర రూ. 15 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో పొందవచ్చు.
ఎంజి హెక్టార్‌ని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లలో స్టైల్, షైన్, స్మార్ట్, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో మరియు సావీ ప్రో అనే 6 వేరియంట్‌లలో పొందవచ్చు. పెరిగిన ధర విషయానికొస్తే,
ఎంజి హెక్టర్ (వేరియంట్ వారీగా) ధరల వివరాలను క్రింద లిస్ట్ చేసాము.
వేరియంట్స్ | పెరిగిన ధరలు |
స్టైల్ పెట్రోల్ | రూ. 27,000 |
షైన్ పెట్రోల్ | రూ. 31,000 |
స్మార్ట్ పెట్రోల్ | రూ. 35,000 |
స్మార్ట్ ప్రో పెట్రోల్ | రూ. 35,000 |
షార్ప్ ప్రో పెట్రోల్ | రూ. 35,000 |
సావి ప్రో పెట్రోల్ | రూ. 27,000 |
షైన్ డీజిల్ | రూ. 31,000 |
స్మార్ట్ డీజిల్ | రూ. 30,000 |
స్మార్ట్ ప్రో డీజిల్ | రూ. 40,000 |
షార్ప్ ప్రో డీజిల్ | రూ. 40,000 |
ఎంజి హెక్టర్ ప్లస్ (వేరియంట్ వారీగా) ధరల వివరాలను క్రింద లిస్ట్ చేసాము.
వేరియంట్స్ | పెరిగిన ధరలు | |
పెట్రోల్ | స్టైల్ | రూ. 27,000 |
షైన్ | రూ. 31,000 | |
స్మార్ట్ మరియు స్మార్ట్ EX | రూ.35,000 | |
స్మార్ట్ ప్రో మరియు షార్ప్ ప్రో | రూ. 40,000 | |
సావి ప్రో | రూ. 35,000 | |
డీజిల్ | స్మార్ట్ | రూ. 24,000 |
స్మార్ట్ ప్రో మరియు షార్ప్ ప్రో | రూ. 40,000 |
స్పెసిఫికేషన్ వారీగా చూస్తే, హెక్టర్ రెండు బిఎస్6 2.0-కంప్లైంట్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో లభ్యం అవుతుంది – అవి ఏవి అంటే 1.5-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ మోటార్ తో 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి యూనిట్‌తో జత చేయబడి ఉండగా, రెండోది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప